ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అన్న విషయం కూడా అర్థం కాని విధంగా మారిపోయింది. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే ఎంతోమంది దారుణంగా సాటి మనుషులను హత్య చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక వెలుగులోకి వచ్చే ఘటనలు చూసిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని విధంగా మారిపోయింది పరిస్థితి. దీంతో ప్రతిక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అందరికీ అని చెప్పాలి. అయితే ఒక మనిషి ప్రాణం తీస్తే దారుణమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇక చిప్పకూడు తినాల్సి వస్తుంది అన్న భయం మాత్రం ఎవ్వరిలో కనిపించడం లేదు అని చెప్పాలి. వెరసి ఇక ఇలాంటి హత్యలకు సంబంధించిన ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. అయితే ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి ఓ దారుణ హత్యకు సంబంధించిన ఘటన కలకలం సృష్టించింది. పెద్ద అంబర్పేట్ లో రాజేష్ అనే వ్యక్తి మృతి వ్యవహారం సంచలనంగా మారిపోయింది. అయితే ఇక ఈ మృతి కేసు వ్యవహారం కాస్త ప్రస్తుతం ఓ కొలక్కీ కి వచ్చింది అనేది తెలుస్తుంది. ఒక్క మిస్డ్ కాల్ ఇద్దరి ప్రాణాలు తీసింది అన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. రాజేష్కు ఆరు నెలల కిందట ఒక మిస్డ్ కాల్ ద్వారా సుజాత అనే టీచర్ పరిచయం అయింది. పరిచయం ప్రేమగా మారింది. అయితే ఆమెకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు అని తెలుసుకొని రాజేష్ దూరం పెట్టడం మొదలు పెట్టాడు. దీంతో సుజాత సూసైడ్ చేసుకుంది. ఇది తెలియని రాజేష్ ఆమెకు ఇటీవల ఫోన్ చేయడంతో కుటుంబ సభ్యులు అసలు విషయం తెలిసి అతనికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో భయపడిపోయిన రాజేష్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఒక మిస్డ్ కాల్ కారణంగా ఇద్దరి ప్రాణాలు పోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: