జగన్ ఓ నిర్ణయం తీసుకుంటే దేనికైనా ముందుకు వెళ్లడమే తప్ప.. వెనక్కి చూసుకునేది లేదు. అయితే తాజాగా జగన్ సర్కారు ఇటీవల తీసుకున్న ఓ కొత్త నిర్ణయంపై కాస్త వెనక్కి తగ్గింది. ఆ నిర్ణయం ఏంటంటే.. రేషన్ బియ్యం బదులు తెల్ల కార్డు దారులకు నగదు బదిలీ చేయడం.. చాలామంది రేషన్ కార్డులు ఉన్నవారు.. బియ్యం తీసుకోవడం లేదని.. తీసుకున్నా వాటిని తినకుండా అమ్ముకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. అందుకే బియ్యం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వమే బియ్యం వద్దన్న వారికి నగదు ఇవ్వాలని భావించింది.


దీన్ని ప్రయోగాత్మకంగా ఒకటి, రెండు జిల్లాల్లో అమలు చేస్తోంది. అయితే.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని కూడా తాత్కాలికంగా వెనక్కి తీసుకుంది. రేషన్ కార్డుదారులకు నగదు బదిలీ ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ యాప్ లో సాంకేతిక లోపం వల్ల ప్రస్తుతానికి  నగదు బదిలీ నిలిపివేశామని ఆయన తెలిపారు. నగదు బదిలీ పై  తర్వాత ఏమైనా  నిర్ణయం తీసుకుంటే సమాచారం తెలియజేస్తామన్నారు. విజయవాడలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..  పౌరసరఫరాల శాఖ పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.


ఇక ధాన్యం కొనుగోళ్లపైనా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని.. జిల్లా యూనిట్ గా తీసుకుని రైతులకు దగ్గరగా ట్రాన్స్ పోర్టు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు  ఆలస్యం లేకుండా సకాలంలో డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటామని.. ప్రజలకు  పోషక ఆహారం కోసం పోర్టిఫైడ్ బియ్యం ఇస్తున్నామని వివరించారు. పోర్టిఫైడ్ రైస్ ను నీటిలో కడిగినపుడు తేలతాయని.. పోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రజలు ప్లాస్టిక్ బియ్యంగా భావించవద్దని కోరుతున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.


ప్రజలకు ఇస్తోన్న బియ్యం  క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడబోమన్న మంత్రి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. ధాన్యం, రేషన్ విషయంలో ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 21 నుంచి నెల 10 రోజుల్లో ధాన్యం సొమ్ములు రైతులకు అందిస్తామని.. రైతులకు ఆధార్ తో అనుసంధానమైన అకౌంట్లలో ధాన్యం డబ్బు జమ చేస్తున్నామని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: