ప్రభుత్వ వ్యవహారాలు చాలా వరకూ లంచాలతో నడుస్తాయన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారులే కాదు.. రాజకీయ నాయకులూ లంచాల కోసం ఏ పనైనా చేస్తారు. మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా కుంభకోణాలకు పాల్పడిన వారే. అయితే.. ఇవన్నీ ఒక ఎత్తు.. ఇక ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవినే లంచంతో కొనేయడం మరో ఎత్తు. అవును.. ఇప్పుడు కర్ణాటకలో సంచలనం రేకెత్తిస్తున్న అంశం ఇది.


రూ.2500 కోట్ల రూపాయలు ఇస్తే ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తారట. నిజంగా నిజం.. నమ్మశక్యం కావడం లేదా.. రూ. 2500 కోట్లు ఇస్తావా.. నిన్న సీఎం చేస్తామంటూ కొంతమంది తనను సంప్రదించారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్  ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మధ్యవర్తులు తనను ఈ మొత్తం డిమాండ్‌ చేశారని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ తెలిపారు. అయితే.. ఈ విషయాన్ని వెల్లడించిన బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ అలా తనకు ఆఫర్ ఇచ్చిన వారు ఎవరో మాత్రం చెప్పలేదు.


చాలా మంది పార్టీ టికెట్‌ ఇప్పిస్తాం.. సోనియా గాంధీ, జేపీ నడ్డాతో సమావేశం ఏర్పాటు చేస్తామంటూ వస్తుంటారని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ తెలిపారు. అలాంటి వారు తనవద్దకు ఓ సారి వచ్చారని.. ఏకంగా రెండున్నర వేల కోట్లు ఇస్తే సీఎం చేస్తామని ప్రతిపాదించారని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ వివరించారు. అయితే.. టికెట్లు, పదవులు ఆశచూపే కంపెనీలు పెద్ద స్కామ్‌గా బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ వర్ణించారు.


రాజకీయాల్లో డబ్బులకు పదవులను ఆశచూపే  దొంగలను నమ్మకూడదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ అంటున్నారు. అయితే.. బసనగౌడ పాటిల్ పాజిటివ్‌ కోణంలో చెప్పినా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి ఇంతకీ ఈ బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ ఎవరు అంటారా.. ఆయన గతంలో వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: