
డైరెక్టుగా ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య చేసుకుంటున్న వారి వివరాలు తెలిసేలా మెటా, ఫేస్ బుక్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల యూపీలో ఎవరైనా ఫేస్ బుక్ లైవ్ లో చనిపోతాను అని పెట్టగానే అమెరికాలో ఉన్న మెటాకు అలర్ట్ మేసేజ్ వెళుతుంది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ లో 28 మందిని ఇక్కడి పోలీసులు కాపాడారు. ఆత్మహత్య చేసుకోకుండా నిలువరించగలిగారు. గత వారం రోజుల్లో ఇద్దరిని కాపాడారు. ఒక యువతి, ఒక యువకుడు లైవ్ పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామని చెప్పగానే ఫేస్ బుక్, మెటాకు మేసేజ్ అందింది. నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని రక్షించారు.
గతంలోగా లైవ్ పెట్టుకుని తమ బాధలు చెప్పుకుని అందరికీ కనిపించేలా చనిపోవాలకోవడం ఇకపై కుదరదు. యూపీ ప్రభుత్వం ఇందుకోసం 500 మంది పోలీసులు పని చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎంతో మంది కుటుంబాలను కాపాడుతున్నారు. ఆంధ్ర పదేశ్ లో కూడా ఫేస్ బుక్, మెటా తో ఒప్పందం చేసుకుంటే బాగుండేది. గతంలో ఇక్కడ కూడా ఇలా ఫేస్ బుక్ లో లైవ్ పెడుతూ సూసైడ్ చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం మెటా తో ఒప్పందం చేసుకుంటే చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు. మొత్తం మీద యూపీ ప్రభుత్వం చేస్తున్న ఒక మంచి పని అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఏపీలో కూడా దీన్నితీసుకు వస్తే బాగుంటుంది.