రాజకీయ నాయకుల్లో మాట తీరుతో విమర్శల అంశంతో జనంలోకి ఎలా తీసుకెళ్లాలో చంద్రబాబును చూసి జగన్ నేర్చుకోవాల్సి ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. జగన్ ఎప్పుడు ఆ రెండు పత్రికలు ఒక టీవీ ఛానల్ అని విమర్శించడం తప్ప విషయాల గురించి మాట్లాడటం లేదని విమర్శలు వస్తున్నాయి  కాబట్టి విషయం తెలిసేలా  ప్రజలకు అర్థమయ్యేలా రాజకీయ నాయకులు మాట్లాడగలగాలి.


చంద్రబాబు పదే పదే రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని విమర్శలకు దిగుతున్నారు. పరిపాలన జగన్ కు చేతకాదని ప్రచారం చేస్తున్నారు. అదే పరిపాలన బాగుంటే చంద్రబాబు టీడీపీ ఎందుకు ఓడిపోయిందని వైసీపీ నాయకులు ప్రతి విమర్శలు చేయడం మొదలు పెట్టారు. బట్ట కాల్చి మీద వేసే విధానాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు మానుకోవాలని కోరుతున్నారు.


పథకాల విషయంలో టీడీపీ ఏమేం ప్రవేశ పెట్టింది. వైసీపీ ఎలాంటి పథకాలను అందజేస్తుందనే తదితర వివరాలు బహిరంగ చర్చలకు సిద్ధమని వైసీపీ నాయకులు సవాల్ చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామనే అంశంలో చర్చకు సిద్ధమని చెబుతోంది.


చంద్రబాబు హయాంలో రుణమాఫీ 30 శాతం ఇచ్చారు. అన్న క్యాంటీన్లు పెట్టారు. కానీ మొత్తం చేసినట్లు చెబుతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. కానీ వైసీపీ నాయకులు ఆయన చేయని పనులను మాత్రం టార్గెట్ చేసి చెప్పడంలో విఫలమవుతున్నారు. చేసిన అభివృద్ది పనులను చెబుతూనే చేయని పనులను కూడా చెబితే అది ప్రజలకు అర్థమవుతుంది. ఇలా చెప్పడం ఎంతో అవసరం. కాబట్టి చంద్రబాబు హయాంలో రుణమాఫీ అనేది కచ్చితంగా అమలు కాలేదనే అంశాన్ని ప్రజలకు తెలిసేలా జగన్ చెప్పాలి. దీన్ని ప్రజలకు తీసుకెళ్లడంలో వైసీపీ నాయకులు, సీఎం జగన్  విఫలం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ చేయని పనుల గురించి చెప్పడంలో చంద్రబాబు మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: