
అయితే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కి భారత సైన్యం వెళుతుందో లేదో తెలియదు. కానీ పిఓకే లో మాత్రం భారత్ కి అనుకూల నినాదాలు, పాకిస్తాన్ కి వ్యతిరేక నినాదాలు వెలువడుతున్నాయని తెలుస్తుంది. కానీ వెళ్తే మాత్రం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవడం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. కానీ ఈ సందర్భంలో పాకిస్తాన్ కి చెందిన కోవర్టులు, పాకిస్తాన్ సైన్యం భారత సైన్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంది.
కానీ స్వాధీనం చేసుకున్నాక వాళ్లని పోషించాల్సి వస్తుంది కేంద్రానికి. పోషించడం కూడా పెద్ద పని కాదు. ఎందుకంటే అందరూ పన్నులు పర్ఫెక్ట్ గా కడుతున్నారు కాబట్టి. ఇప్పటికే ఇలాంటి వాళ్లను చాలామందిని పోషించుకుంటూ వస్తుంది భారతదేశం. అయితే ఈ ప్రాసెస్ లో శరణార్థులుగా వచ్చిన వాళ్ళు భారత్ కే వ్యతిరేకంగా తయారవడమే అసలు సమస్య. కానీ మొన్న బంగ్లాదేశ్ నుండి భారతదేశం వచ్చిన వాళ్లని పోషిస్తే వాళ్లు తిరిగి బంగ్లాదేశ్ పై ప్రేమ, భారతదేశంపై ద్వేషాన్ని చూపిస్తున్నారు.
ఈ సందర్భంలో పీఓకేలోని జనాలు కూడా ఇదే విధంగా మనం అన్నం పెట్టినంతవరకు బాగానే ఉంటారని, అన్నం పెట్టిన తర్వాత తిరిగి పాకిస్తాన్ కే జై కొడతారని అంటున్నారు ఇక్కడ సామాజిక నిపుణులు. పిఓకే సమస్య అనేది సున్నితమైన అంశం. కాబట్టి దీనిని కేంద్రం ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాల్సి ఉంది అంటున్నారు.