
`మంగళగిరి ప్రజలకు మాటిస్తున్నా.. ` అంటూ.. యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఇక్కడి ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. అయితే.. అప్పట్లో.. వీటిని విన్న.. వైసీపీ అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్నారెడ్డి ఎద్దేవా చేశారు. వస్తున్నాడండీ.. పోటుగాడు.. అంటూ నోరు పారేసుకున్నారు. ఏం చేస్తారు.. ఇంతకన్నా.. చేయాల్సింది అంతా నేనే చేసేశా.. అని కూడా ఆళ్ల చెప్పుకొచ్చారు. కానీ.. నారా లోకేష్.. తన హామీల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
ఎన్ని ఆటుపోట్లు ఎదురొచ్చినా.. రాజకీయ ప్రతికూలతలు.. ఎదురొచ్చినా.. ఆయన ధైర్యంగా వాటన్నింటి నీ ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికల్లో బీసీలను నారా లోకేష్‌కు దూరంగా ఉంచాలన్న వైసీపీ ఎత్తుగడలను సైతం పటాపంచలు చేసి.. 90 వేల ఓట్ల మెజారిటీ దక్కించుకుని సరికొత్త రికార్డును సృష్టించారు. ఇక, అక్కడి నుంచిఆయన ప్రారంభించిన ప్రస్థానం.. మంగళగిరి చరిత్రను మార్చేస్తోంది. ప్రజాదర్బార్‌ను మొట్టమొదట చేపట్టిన నాయకుడిగా ఆయన మంగళగిరి ప్రజలమనసులు దోచుకున్నారు.
చేనేతకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చి.. ఇక్కడివారికి ఉపాధి, ఆదాయం రెండూ పెంచుతానని చెప్పిన మాటను కూడా నిలబెట్టుకున్నారు. అంతేకాదు.. అన్న క్యాంటీన్ల ఏర్పాటు.. తోపుడు బండ్ల పంపిణీ.. చేతి వృత్తుల వారికి ప్రోత్సాహం. దివ్యాంగులకు ఉపాధి.. ఇలా సామాజిక సేవలో నారా లోకేష్ చరిత్రను తిరగరాస్తున్నారు. వీటికి తోడు అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు.. ఇటీవలే.. 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. రహదారులను అద్దంగా నిర్మిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను మరింతగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్నవారు.. రాబోయే రెండేళ్లలో మంగళగిరి చరిత్రను తిరగరాయడం ఖాయమని చెబుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.
నోట్ : వ్యక్తిగత, కుటుంబ సమస్యలు వద్దు