తల్లిదండ్రులు తమ పిల్లలకు అల్పాహారం కోసం కుకీలు, బిస్కెట్లను ఎక్కువగా ఇస్తుంటారు. చాలా సందర్భాల్లో పిల్లలు అదేపణంగా ఏడుస్తుంటే.. వారికి కుకీస్, బిస్కెట్లతోపాటు పలు తీపి పదార్థాలను కూడా అందిస్తుంటారు. అయితే, అవి చాలా ప్రమాదం అని.. వాటిని తినదగినదిగా ఉంచడానికి కుకీలకు చాలా హానికరమైన కెమికల్స్ జోడిస్తుంటారని పేర్కొంటున్నారు.అయితే, మీరు కూడా మీ పిల్లలకు రోజుకు చాలాసార్లు తినడానికి కుకీలను లేదా బిస్కెట్లను ఇస్తుంటే తప్పనిసరిగా ఈ విషయాలను తెలుసుకోవాలని పేర్కొంటున్నారు. దీనిపై సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ మెడిసిన్ విభాగం HOD ప్రొఫెసర్ డాక్టర్ జుగల్ కిషోర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ రకమైన ఆహారం వల్ల పిల్లలు చాలా సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని.. ఇవి నేరుగా ప్రభావం చూపుతాయని ఆయన తెలిపారు.కుకీలలో చాలా ఎక్కువ చక్కెర కలుపుతారు. వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి బాగా పెరుగుతుంది. చిన్నతనంలో పిల్లలు చాలా చురుకుగా ఉంటారు.. అందువల్ల కొంత సమయం తర్వాత వారి రక్తంలోని చెక్కర స్థాయిలో మార్పు రావడం, పెరగడం కనిపిస్తుంది.


డాక్టర్ జుగల్ కిషోర్ ప్రకారం.. తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్ల చరిత్ర మధుమేహంతో ఉంటే.. అలాంటి వారి పిల్లలలో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలు కుకీలు ఎక్కువగా తింటే మధుమేహం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు.ఈ కుకీలలో ప్రిజర్వేటివ్స్, రిఫైన్డ్ షుగర్ వాడతారని వాటిని తినడానికి వీలుగా తయారు చేస్తారని.. అందువల్ల ఇది ఆరోగ్యానికి విషం లాగా ఉంటుందని డాక్టర్ కిషోర్ చెప్పారు.అవి తీపి, రుచిగా ఉండటం వల్ల పిల్లలు వాటిని ఇష్టపడతారు. పిల్లలు ఏడ్చినప్పుడు ఇంకా ఏదైనా తినడానికి కావాలన్నప్పుడు తల్లిదండ్రులు వారికి తినడానికి రోజుకు చాలా సార్లు కుకీలను ఇస్తుంటారని.. ఇది చాలా తప్పని వారు అంటున్నారు.ఇందులో శుద్ధి చేసిన పిండి అంటే మైదాను  ఉపయోగిస్తారు. ఈ పిండి కారణంగా కుకీలలో ఫైబర్  ఉండదు. దీని కారణంగా పిల్లలు మలబద్ధకం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి ఆహారం అలవాటు ఉన్న పిల్లల కడుపు అసలు 3 నుంచి 4 రోజులపాటు శుభ్రం అవ్వదు. ఈ పరిస్థితి కొనసాగితే అది వైద్య చికిత్స పరిధికి వస్తుందని జుగల్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: