చర్మ సమస్యలు అనేవి చాలా కామన్ గా వస్తాయి. కొంతమందికి ఆ సమస్యలు వస్తే ఈజీగా పోవు.ఎన్ని మందులు వాడినా కూడా అవి అస్సలు పోనే పోవు. అయితే వేప నూనె చర్మ సమస్యలకు చాలా బాగా పని చేస్తుంది.వేపనూనెకు ఆయుర్వేదంలో చాలా ప్రత్యేక స్థానం ఉంది. చర్మ, జుట్టు సంబంధిత వ్యాధుల నివారణకు ఈ వేప నూనె అనేది చాలా అద్భుతంగా పని చేస్తుంది. వేప నూనె దంతాల సమస్యలను కూడా ఈజీగా తొలగిస్తుంది.ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. దంతంలోని పిప్పళ్ళు, క్రిములు, నోటి దుర్వాసన ఇంకా అలాగే పంటి నొప్పి సమస్యలను కూడా ఈజీగా తగ్గిస్తుంది.ఇక మలేరియాను తగ్గించడానికి కూడా వేప నూనెను ఉపయోగిస్తారు. వేప నూనె మలేరియాను వ్యాప్తి చేసే దోమల నుంచి మనల్ని ఈజీగా కాపాడుతుంది. వేప నూనెను చాలా పురుగుమందులలో కూడా ఉపయోగిస్తారు.అందుకే ఈ వేప నూనెను చర్మానికి రాసుకునే నిద్రిస్తే దోమలు అస్సలు కుట్టవు.ఇంకా ఎన్నో రకాల ఆయుర్వేద మందుల తయారీలో ఈ వేపను ఉపయోగిస్తున్నారు.


ముఖ్యంగా చర్మ సమస్యలైన మొటిమలు, సోరియాసిస్, తామర ఇంకా అలాగే హెర్పెస్ వంటి వాటిని నయం చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు.కొంతమందికి అయితే వారి చర్మం తేమ తక్కువగా ఉన్నప్పుడు తెల్లగా పొడిబారినట్లు అవుతుంది.అలాంటి పరిస్థితిలో చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి.పొడి చర్మం సమస్యను తగ్గించడానికి వేప నూనెను ఉపయోగించవచ్చు. అలాగే ఇందులో ఉండే విటమిన్-ఇ, అమైనో ఆమ్లాలు ఇంకా కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.అర టీస్పూన్ ఆలివ్ నూనె తీసుకొని అందులో 8 నుంచి 10 చుక్కల వేపనూనె కలపాలి.తరువాత తామర  ఉన్న చోట ఈ నూనె ని రాయాలి.ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు దురద ఇంకా అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందటానికి ఎంతగానో సహాయపడతాయి. అలాగే ముఖం మీద మొటిమలు ఉంటే వేప నూనె చాలా బాగా పని చేస్తుంది.అలాగే నొప్పి సమస్యను తొలగించడానికి వేప నూనె పని చేస్తుంది. ఇవి గోరుచుట్టు సమస్యను తగ్గించడానికి ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: