కేవలం అరటి పండే కాదు..అరటి తొక్కతో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ అరటి తొక్కలోని ప్రయోజనాలు తెలుసుకుంటే తొక్కను బయట పడేయకుండా తీసుకుంటారు. అలాగే అరటిపండు తొక్కలో శరీరానికి అవసరమైన పోషకాలు చాలా ఉంటాయి.అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.అరటి తొక్క తినడం వల్ల శరీరానికి అవసరమైన పొటాషియం, ఫైబర్, అమినోస్ వంటి పోషకాలు లభిస్తాయి. అలాగే, అరటిపండు తొక్కలో యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇక ఈ యాంటీఆక్సిడెంట్లు చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి.కాబట్టి అరటిపండు తొక్క తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం ఇంకా క్యాన్సర్ వంటి చాలా వ్యాధులతో పోరాడే శక్తి మనకు లభిస్తుంది.అలాగే అరటిపండు తొక్కలో ఉండే రిచ్ ట్రిప్టోఫాన్, విటమిన్ బి6 ఒత్తిడిని తగ్గించి మానసిక సమస్యలను ఈజీగా దూరం చేస్తుంది. ఇందులో ఉండే బి6 మనకు మంచి నిద్రను ప్రోత్సహించడంలో చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి ఒత్తిడి వంటి సమస్యలకు నిద్రకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.


ఇంకా ఈ అరటిపండు తొక్కలో ఎక్కువ శాతం పీచు పదార్ధాలు ఉంటాయి. కాబట్టి ఈ అరటిపండు తొక్కలను తినడం వల్ల జీర్ణ రుగ్మతలు ఈజీగా నయమవుతాయి. ఇది ఉదర వ్యాధులకు కూడా ఈజీగా చెక్ పెడుతుంది.మీరు ఈ అరటిపండు తొక్కలు తినాలనుకుంటే బాగా పండిన పండ్లను ఎంచుకోవాలి. ఈ పండిన పండ్ల తొక్కలు ఎప్పుడు తీపి ఎంతో రుచిని కలిగి ఉంటాయి. దాని తొక్క కూడా చాలా సన్నగా ఉంటుంది.తరువాత ఒలిచిన తొక్కను తీసుకుని రుబ్బుకోవాలి. ఈ తురిమిన తొక్కను మీకు ఇష్టమైన ఆహారాలతో పాటు తినవచ్చు .లేదంటే బ్రెడ్ మీద జామ్ లాగా కూడా తినొచ్చు. అలాగే దీన్ని ఉడికించి కూడా తినవచ్చు. ఉడికించిన, డీప్-వేయించిన, మీకు కావలసిన విధంగా, మీరు అరటి తొక్కలను ఈజీగా మీ ఆహారంగా మార్చుకోవచ్చు. అరటిపండు తొక్కను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి తెల్లరక్తకణాల ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: