
ఇప్పటివరకు చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటే, మరి కొంతమంది ఎంత తిన్నా కూడా బరువు పెరగలేక , సరైన శరీర దృఢత్వం లేక నలుగురిలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎప్పుడైతే శరీరం దృఢంగా ఉంటుందో అప్పుడే ఎలాంటి దుస్తులను ధరించినా, చాలా చక్కగా చూడముచ్చటగా కనిపిస్తారు. నలుగురిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అయితే చాలా మంది ఎంత తిన్నా లావు కాలేక పోతున్నామని బాధ పడుతున్నారు.. అయితే అలాంటి వారి కోసమే ఇప్పుడు కొన్ని చిట్కాలను తీసుకొచ్చాము. అయితే క్రమం తప్పకుండా కేవలం పది రోజులు ఈ చిట్కాలను పాటిస్తే చాలు, మీరు బరువు పెరగడాన్ని ఎవరూ ఆపలేరు.. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
సాధారణంగా కొంతమంది ఎంత ఎక్కువ తిన్నా సరే లావు కారు. కానీ కొంతమంది జంక్ ఫుడ్ తింటే లావు అవుతారు అని అపోహ తో ఎక్కువ జంక్ ఫుడ్ తింటారు. కానీ దానివల్ల పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది తప్పా బరువు పెరగరు. తద్వారా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరికొంతమందిలో జీర్ణాశయ సమస్యల కారణంగా బరువు పెరగరు. ఇలాంటి వారు ఎక్కువ తిన్నా, తాగినా బరువు పెరగరు. అయితే మీరు ఏం చేయాలంటే.. మీరు బరువు పెరగడానికి మూడు మార్గాలు నిర్దేశించబడ్డాయి. అందులో హై కేలరీస్, హై కార్బోహైడ్రేట్లు, హెల్ది లైఫ్ స్టైల్ ఫాలో అవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
బరువు పెరగడానికి ముఖ్యమైన అలవాటుగా ఫుల్ ఫ్యాట్ కలిగిన పాలను తాగడం మంచిది. ఇది ఆరోగ్యకరంగా మంచి కొవ్వు పెరిగేలా చేస్తుంది. అయితే ఈ ఫుల్ ఫ్యాట్ కలిగిన పాలను రాత్రి పడుకునే ముందు తాగడం మంచిది. తద్వారా త్వరగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. అలాగే పీనట్ బటర్, అరటి పండ్లు కోడిగుడ్లు, నట్స్, సోయాబీన్స్, ఉడకబెట్టిన శనగలు , బంగాళాదుంపలు , ఖర్జూరం , అశ్వగంధ పాలు ఇలాంటివి నిత్యం తీసుకుంటూ ఉండడం వల్ల బరువు పెరగడం గమనించవచ్చు..