కామెర్లు హైటటైటిస్ – ఎ అనే వైరస్ వల్ల వస్తుందంటున్నారు వైద్యులు. ఈ వైరస్ కలుషితమైన ఆహారం, నీటి ద్వారా మనుషులకు సోకుతుందనీ అంటున్నారు డాక్టర్లు. ఈగలు హైపటైటిస్ ఎ వాహికలు అని కూడా తెలిసింది. అందువల్ల రోడ్డు ప్రక్కన గాలి ప్రభావానికి లోనయ్యే ఆహార పధార్థాలనూ, తినుబండారాలనూ ఎట్టి పరిస్థితుల్లోనూ తినరాదు.  నీటిని – కాచి వడగట్టిన నీటిని మాత్రమే తాగాలి.

Image result for jaundice

పండ్లు, ఇతర పధార్థాలు తినవలసివచ్చినపుడు అరటి, కమలా, నారింజ వంటి తోలు గల పళ్ళని మాత్రమే తినాలి. వీటికి పైన తోలు వుండటం వల్ల కాలుష్యం సోకుతుందన్న భయం అక్కర్లేదు. ప్రయాణాల్లో సాధ్యమైనంత వరకూ కొళాయిల్లో లేదా బానల్లో వుంచి ఇచ్చే నీటిని కాకుండా మినరల్ వాటర్ బాటిల్ (నుంచి బ్రాండ్ చూసి కొనండి) నీళ్ళు త్రాగడం మంచిది. వేడిగా వుండే కాఫీ, టీ పరవాలేదు. కామెర్ల వ్యాధి ఇంట్లో ఎవరికన్నా వున్నపుడు ఇతర సభ్యులకు సోకే అవకాశాలు ఎక్కువగా వుంటాయి.

Image result for jaundice

అందుచేత రోగి టాయిలెట్ కి వెళ్ళివచ్చిన పిదప దానిని శుభ్రం చేసి గానీ ఇతరులు వాడరాదు. రోగి వాడిన పాత్రలు, దుస్తులు విడిగా వుంచాలి. కామెర్లు అంత ప్రమాదకరమైన రోగం కానప్పటికీ అశ్రద్ద చేస్తే ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం వుంది. కాలేయాన్ని పట్టి పల్లార్చే హైపటైటిస్- ఎ అనే వైరస్ కారణంగానే కామెర్లు వస్తాయని చెప్పుకున్నాం. ఆహార నియమాలు పాటిస్తూ తగినంత విశ్రాంతి తీసుకుంటే కామెర్ల నుండి సులభంగా బయటపడవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: