క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 24 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో..  ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


ప్రముఖుల జననాలు:



0015: జూలియస్ సీజర్, జెర్మానికస్, రోమ్ దేశపు సైన్యాధిపతి (మ.0019).



1686: పోలిష్-జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజనీర్ అయిన డేనియల్ గాబ్రియేల్ ఫారెన్‌హీట్.. ఫారెన్‌హీట్ స్కేల్‌ను అభివృద్ధి చేశాడు. డేనియల్ గాబ్రియల్ అతి కచ్చితంగా వేడిని కొలిచే 'థర్మామీటర్' (1714లో మెర్క్యురీ థర్మామీటర్) ని కనుగొన్నాడు. 1709లో ఆల్కహాల్ థర్మామీటర్ ని కనుగొన్నాడు. (మ.1736).



1819: బ్రిటన్ రాణి విక్టోరియా, బ్రిటీషు మహారాణి. (మ.1901).



1911: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2006)



1955: రాజేష్ రోషన్, భారతీయ సంగీత దర్శకుడు.



1933: పి.జె.శర్మ, డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.2014)



1973: శిరీష్ కుందర్, సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్



1977: జీత్ గంగూలి, భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు



ప్రముఖుల మరణాలు:



1543: నికొలస్ కోపర్నికస్, ఖగోళ పరిశోధకుడు, పోలాండ్ లో  మరణించాడు.



1997: నల్లమల గిరిప్రసాద్, కమ్యూనిస్టు నేత. (జ.1931)



2000: మజ్రూ సుల్తాన్‌పురి, భారతీయ కవి, పాటల రచయిత (జ .1919)



2013: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీ వేత్త. (జ.1928)



సంఘటనలు:



1815: ఆస్ట్రేలియా లోని లచ్‌లాన్ నదిని, 'జార్జి ఇవాన్స్' కనుగొన్నాడు.



1915: థామస్ ఆల్వా ఎడిసన్ టెలిఫోన్ సంభాషణలను రికార్డ్ చేయడానికి 'టెలిస్క్రైబ్' ని కనుగొన్నాడు.



1941: హెచ్.ఎమ్.ఎస్. హుడ్, అనే బ్రిటిష్ యుద్ధనౌకను జర్మనీ యుద్ధనౌక డి.కె.ఎమ్. 'బిస్మార్క్' ముంచివేసింది. ఈ ఘటనలో 1416 మంది మరణించారు. బ్రతికి బట్ట కట్టిన వారు ముగ్గురే ముగ్గురు.



1954: భూమి నుంచి 241 కి.మీ (150 మైళ్ళ) పైకి రాకెట్ మొట్ట మొదటిసారిగా ఎగిరింది. న్యూమెక్సికో లోని 'వైట్‌సాండ్స్' అనే ఎడారి ప్రాంతం లో రాకెట్ ప్రయోగించారు.



1985: బంగ్లాదేశ్ లో వచ్చిన తుఫానుకి 10,000 మంది ప్రజలు మరణించారు.



1993: మైక్రోసాఫ్ట్ 'విండోస్ ఎన్.టి' (Windows NT) విడుదల చేసింది.



2019: భారతదేశంలోని సూరత్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇరవై రెండు మంది విద్యార్థులు మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: