ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే..1498 వ సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ ఉత్తర అమెరికా ప్రధాన భూభాగం చేరడం జరిగింది.1790 వ సంవత్సరంలో అమెరికాలో మొట్టమొదటి జనాభా లెక్కలు ముగిసిన రోజు. ఆనాటి అమెరికా జనాభా వచ్చేసి కేవలం 39, 29, 214 మాత్రమే.1774 వ సంవత్సరంలో జోసెఫ్ ప్రీస్ట్‌లీ ఇంకా షీలే అనే శాస్త్రవేత్తలు ఆక్సిజన్ (ఆమ్లజని ) మూలకాన్ని కనుగొన్నారు.1793 వ సంవత్సరంలో ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి (కొలమానం (యూనిట్) ) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1958 అక్టోబరు 1న ప్రవేశ పెట్టడం జరిగింది. డబ్బు, కానీ, అర్ధణా, అణా ఇంకా బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1957 ఏప్రిల్ 1 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టడం జరిగింది.1798 వ సంవత్సరంలో ఆంగ్ల నౌకాదళం ఇంకా నెల్సన్ నాయకత్వంలో, కింద, నైలు నది దగ్గర జరిగిన యుద్ధంలో ఫ్రాన్స్ నావికాదళాన్ని ఓడించడం జరిగింది.

1861 వ సంవత్సరంలో "టైమ్స్ వార్తాపత్రిక మొట్టమొదటి "వాతావరణ వివరాలు" ప్రచురించడం జరిగింది. ఇక ఆనాడు, వాతావరణ శాఖలో పనిచేస్తున్న "అడ్మిరల్ రాబర్ట్ ఫిట్ఝ్‌రోయ్" ఈ వాతావరణ వివరాలు అందచేయడం జరిగింది.1876 వ సంవత్సరంలో కొలరాడో 38వ రాష్ట్రంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చేరడం జరిగింది.1914 వ సంవత్సరంలో జర్మనీ సోవియట్ యూనియన్ పై యుద్ధం ప్రకటించడం జరిగింది. ఇటలీ దేశం దానికదే తటస్థ దేశంగా చెప్పడం జరిగింది.1936 వ సంవత్సరంలో అడాల్ఫ్ హిట్లర్ బెర్లిన్ ఒలింపిక్స్ ఆటల ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించడం జరిగింది.1957 వ సంవత్సరంలో భీమసేన్ సచార్, ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పదవీస్వీకారం చేశారు.1969 వ సంవత్సరంలో ఎయిర్ ఛీఫ్ మార్షల్గా అర్జున్ సింగ్ పదవి స్వీకారం చేశారు.1946 వ సంవత్సరంలో అమెరికన్ ప్రెసిడెంటు ట్రూమన్ రెండు చారిత్రాత్మకమైన చట్టాల మీద సంతకం చేయడం జరిగింది. అందులో ఒకటి అటామిక్ ఎనర్జీ కమిషన్ చట్టం అలాగే మరొకటి పుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ చట్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: