చిన్నపిల్లలకు ఏది మంచో, చెడో తెలియదు. వాళ్లకు ఎటువంటి పని చేస్తే మంచిదో అన్నా విషయం తెలియదు. అందుకనే తల్లితండ్రులు పిల్లలను ఒక కంట కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాగాని ఎదో ఒక చిలిపి పనులు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. అవేంటో తెలిసుకుందాం.. వంట శాలలు పిల్లలకు చాలా ప్రమాదకరం. వారిని నిప్పు నుండి, మొనదేరిన వస్తువుల నుండి, బరువైన వస్తువులనుండి దూరంగా ఉంచండి. పిల్లలు నిప్పులను ఊదడం చేయకూడదు. అది అనారోగ్యం పాలు చేస్తుంది.విషపదార్థాలను పిల్లలకు దూరంగా ఉంచండి. ఖాళీ శీతల పానీయాల సీసాలలో విష పదార్ధాలు ఉంచకండి.




పిల్లలకు కాలినపుడు, చల్లని నీటిని కాలిన చోట నొప్పి తగ్గేవరకు పోయండి (సుమారుగా 10 నిముషాల పైన)వాహనాలు, సైకిళ్ళు పిల్లల గాయాలకు, మరణాలకు కారణమవుతాయి. వీటి నుండి జాగ్రత్తగా వుండండి. చిన్న పిల్లలకు ప్రమాద వస్తువులైన కత్తులు, గాజు ముక్కలు, విద్యుత్తు తీగలు, మేకులు, పిన్నులు మొదలగు వాటిని దూరంగా ఉంచండి.చిన్న పిల్లలు మన్ను తినకుండా చూడండి. అలాగే వాళ్ళకి నాణేలు  వంటి చిన్న చిన్న వస్తువులు నోటికి దగ్గరగా పెట్టుకోకుండా చూడండి. ఇవి ఊపిరిని అడ్డుకుంటాయి.చిన్న పిల్లలు నీటి దగ్గర ఆడుకోకుండా చూడండి . లేదంటే వీరు వాటిలో (చెరువులు, సరస్సులు,బావులు) పడిపోయే ప్రమాదముంది.




ప్రధమ చికిత్స డబ్బాను ఇంటిలో  ఏర్పాటు చేయండి.ఏదైనా ప్రదేశానికి చిన్న పిల్లలతో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చిన్న పిల్లలకు ఏమైనా ప్రమాదముందేమో తెలుసుకోండి, చూడండి.పిల్లలకు ఏమైనా ప్రమాదకర పరిస్థితులు మన ఇంటిలో ఉన్నాయేమో చూడండి. చిన్న పిల్లలకు ఊపిరి ఆడనపుడు ఏమి చెయ్యాలో తెలుసుకుని, ఆ పద్ధతులను తల్లి దండ్రులతో, అన్న దమ్ములతో, తాతలతో పంచుకోండి. ఎంత పని ఉన్నాగాని పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. విలయితే పిల్లలు పడుకున్నాక పని చేసుకుంటే మంచిది.. అలాగే ఫోన్ ఛార్జింగ్ పెట్టినపుడు చార్జర్ అలా వదిలేయకండి.. ఒక్కోసారి పిల్లలు ఆ వైర్ ను నోటిలో పెట్టుకునే ప్రమాదం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: