మ‌నిషి ద‌గ్గ‌ర‌కు డ‌బ్బు ఎన్ని రూపాల్లో వ‌స్తుందో తెలుసా??

జ‌న‌నం నుంచి మ‌ర‌ణం వ‌ర‌కు మ‌నిషికి ధ‌నం అవ‌స‌రం. జీవితాన్ని న‌డిపించే ఇంధ‌నం కోసం త‌మ శ్ర‌మ‌నంతా ధార‌పోస్తారు. అంద‌రిక‌న్నా ఒక మెట్టు పైనుండాల‌ని, ధ‌న‌వంతుడిగా జీవించాల‌ని, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండ‌కూడ‌ద‌ని ప్ర‌తి మ‌నిషి భావిస్తారు. మ‌రి ఆ మ‌నిషికి ధ‌నం అనేది ఎన్ని రూపాల్లో వ‌స్తుందో తెలుసా? ల‌క్ష్మీదేవి క‌టాక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో తెలుసా?

1. యోగంద్వారా. 2. ప్రాప్తం ద్వారా 3.  శ్రమ ద్వారా ధ‌నం వ‌స్తుంది

యోగం 3 రకాలుగా ఉంటుంది.

1. ధనవంతునిగా పుట్టడం
2. మధ్యవయసులో ఏదో ఒక   వ్యాపారములో ధనవంతులు కావటం
3. తన సంతానము ద్వారా వృద్ధాప్యంలో సంప‌న్నుడు అవ‌టం.

అదృష్టం 3 ర‌కాలుగా ఉంటుంది

1. తాను పుట్టినప్పుడు తల్లిదండ్రులకు కలసివచ్చి ధనవంతుల‌వటం.
2. తన జీవిత భాగస్వామి అడుగుపెట్టిన సమయము ద్వారా సంపన్నుల‌వటం.
3. తన సంతానము ద్వారా ధనవంతుల‌వటం లాంటివన్నీ యోగం అంటారు
------------------

2. ప్రాప్తము గురించి తెలుసా?
1. తనకు ఎవరో రాసిన వీలునామా మూలంగా ధనం రావటం.
2. నిధి, నిక్షేపాలు దొరకటం.
3. ఏ లాటరీ ద్వారానో లేదా జూద వ్యసనం ద్వారానో ధనం రావటం.
ఈ ప్రాప్త్యంద్వారా వ‌చ్చే ధనాన్ని అనుభవించే యోగ్యత‌ చాలా తక్కువమందికే ఉంటుంది.
---------------
3. శ్రమ ద్వారా ధనం రావటం.
---------------

ధనానికి ముగ్గురు శత్రువులుంటారు. వారెవ‌రంటే..
1.అహంకారం.
2.వ్యసనం.
3.వాంఛ.


ఈ మూడు మ‌నిషికి లేకుంటే ధనం నిలుస్తుంది. సామాన్యముగా ప్రాప్తము ద్వారా వచ్చే ధనం వారున్నంత వరకు ఉంటుంది తరువాత పోతుంది. మ‌నం చాలా మంది విషయంలో వింటూనే ఉంటాము.. చూస్తూ‌నే ఉంటాము.. పెద్ద‌లు ఇచ్చిన ఆస్తిని కరిగించి పిల్ల‌ల్ని రోడ్డున ప‌డేశార్రా అంటుంటారు. సాధారణంగా గురువులు కానీ మ‌రెవరైనా కానీ ప్రాప్తాన్ని మార్చ‌లేరుకానీ యోగాన్ని మార్చవచ్చు. ప్రతిజీవికి ఎక్కడో ఒక‌చోట క‌చ్చితంగా ధన యోగం ఉంటుంది. కావాలంటే దాన్ని మ‌నం కొంత ముందుకు జ‌రుపుకోవ‌చ్చు. ప్ర‌తి రోజు ఇష్ట‌దైవాన్ని ధ్యానం చేయ‌డం, ప్ర‌య‌త్నించ‌డం, సాధ‌న, భ‌య‌భ‌క్తులు, దైవానుగ్ర‌హం అవ‌స‌రం. అందుకు మ‌నం కొంత శ్ర‌మ‌ను ధార‌పోస్తే చాలు. ఈరోజుల్లో ఇవ‌న్నీ జ‌రిగేవికావు.. పెట్టేవికావు.. ఎందుకులే అనుకుంటే  ఎవ‌రిష్టం వారిది. ఆ భ‌గ‌వంతుడు లేకుండానే మ‌న‌కు కంప్యూట‌ర్లు వ‌చ్చాయా? ఆ భ‌గ‌వంతుడు ఇవ్వ‌కుండానే మ‌నం కంప్యూట‌ర్ల ముందు కూర్చొని చ‌ద‌వ‌గ‌లుగుతున్నామా?. నెగెటివ్ ఆలోచ‌న‌లు లేకుండా మ‌న‌సును ప్ర‌శాంతంగా ఉంచుకొని పాజిటివ్ ఆలోచ‌న‌ల‌తో పైన చెప్పిన‌వి పాటిస్తే చాలు.. జీవితం మారుతుంది.





మరింత సమాచారం తెలుసుకోండి: