ఒకప్పుడు తెలుగు పిలుపులు ఎన్నో. బాబాయి, పెదనాన్న, మామయ్య, మేనమామ ఇలా ఎన్నో వరుసలు కానీ ఇప్పుడు అవన్నీ కనిపించడం లేదు. పిన్ని, పెద్దమ్మ, అత్త, మేనత్త.. ఇలాంటి పిలుపులు ఇప్పుడు కనిపించడం లేదు. కేవలం రక్త సంబంధం ఉన్నవారినే కాదు. ఇరుగిల్లు, పొరుగిల్లు అందరినీ వరుసలు పెట్టి పిలుచుకునే సంప్రదాయం ఉండేది.

 

కానీ ఇప్పుడు అవన్నీ కనుమరుగై పోతున్నాయి. బాబాయి.. అంటే.. ఏమోయ్ అబ్బాయి! అనే పిలుపులు నేడు క‌నిపించ‌డంలేదు. ముఖ్యంగా తెలుగు లోగిళ్లకు అందాన్ని అద్దే.. కుటుంబ బంధాల్లో వ‌స్తున్న మార్పుల ఫ‌లితంగా పిలుపులు కూడా మారిపోతున్నాయి. బాబాయి.. పెద‌నాన్నల స్థానంలో అంకుల్స్ చేరిపోతున్నారు.

 

పెద్దమ్మ, పిన్ని పేర్లు మ‌టుమాయమై ఆంటీలు, అంకుల్సే మాత్రమే మిగిలిపోతున్నారు. అన్న, తమ్ముడు, దాయాది ఎవడైనా కజినే.. మన బంధాలనన్నీ ఈ ఆంటీ, అంకుల్ , కజిన్ మింగేశారు. తెలుగు వారి ప్రత్యేకతను మాయం చేస్తున్నారు. భాష నేర్చుకోవడం మంచిదే కానీ. మన సంస్కృతిని మాత్రం మరచిపోకూడదు. అమ్మానాన్నలను మరిపించేలా మమ్మీ డాడీ సంస్కృతిని అంతం చేద్దాం. ఆప్యాయతల తెలుగు బంధాలు నిలుపుకుందాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: