మనిషిని విజయ తీరంవైపు నడిపిచేంది ఏది.. కృషా.. పట్టుదలా.. ఈ రెండూనా.. వీటికంటే.. ఒక్కటి మనిషిని గెలుపువైపు నడిపిస్తుంది.. అదే.. ఆశ.. ఎప్పటికైనా గెలుస్తామన్న నమ్మకం లేకపోతే.. ఆ పోరాటం ఆసక్తికరంగా సాగదు. ఆ పోరాటంలో కసి కనిపించదు.

 

 

గెలుపు కోసం జరిగే పోరాటంలో అనేక సార్లు నిరాశ, నిస్పృహ ఆవరించవచ్చు గాక..

ఆ దశలో మనిషి ఆశ్రయించవలసింది ఆశావాదాన్నే. గెలిచి తీరాలన్న కోరిక గుండెల్లో నిరంతరం కణకణలాడుతూ ఉండటమే ఆశావాదానికి నిర్వచనం. సానుకూల ధోరణి, ఆశావహ దృక్పథం మనిషిని విజయ తీరాలకు తప్పక చేరుస్తుందని మన ప్రాచీన సాహిత్యం చెబుతోంది.

 

 

ఈ విషయంలో వేదాలు కూడా నిత్యం అదే చెబుతుంటాయి. జీవం తొణికిసలాడుతూ నిండు నూరేళ్లు చూద్దాం... నూరేళ్లు విందాం... నూరేళ్లూ మాట్లాడుతూ ఉందాం అని వేదం ప్రోత్సహించింది. సర్వస్వాన్నీ కోల్పోయినా, రేపనేది ఒకటి మిగిలేఉంటుందన్న ఆశే మనిషి జీవితానికి చుక్కాని కావాలంటోంది మన సాహిత్య సంపద.

 

 

అందుకే జీవితంలో ఏది కోల్పోయినా ఆశ కోల్పోవద్దు. అదే మీ భవిష్యత్తుకు భరోసా. కొన్నిసార్లు ఓడిపోతామేమో గానీ.. అది ఎప్పడూ శాశ్వతం కాదు. జీవితంలో ఘోరంగా ఓడిపోయినప్పుడు తీవ్ర నిరాశకు లోనైనప్పుడు చనిపోవాలని కూడా అనిపిస్తుంది. ఆ ఆలోచనలన్నీ అధిగమించేలా చేసేది ఆశ ఒక్కటే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: