పూజామందిరాన్ని ఏ దిక్కున నిర్మించాలి:
ఇల్లు నిర్మించేటప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే , పూజ గది ఏ దిక్కున నిర్మించుకోవాలి అనేది. దిక్కులకు రారాజైన ఈశాన్య దిక్కులోనే పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఈశాన్య దిక్కులో పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం వల్ల, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించి, ఇంట్లో ఉన్న వాళ్లంతా ఆరోగ్యంగా ఉంటారు.
పూజ మందిరంలో విగ్రహ ప్రతిష్ట ఎలా చేయాలి..
పూజ మందిరంలో పెట్టే విగ్రహాలను ఒకే దేవుడికి సంబంధించిన విగ్రహాలను పెట్టకుండా, మీకు కలిసొచ్చే దేవత విగ్రహాలను పూజ మందిరంలో ప్రతిష్టించుకోవాలి. ఇంకా అంతే కాకుండా ఒక దేవుడి విగ్రహానికి,మరొక విగ్రహానికి కొంచెం స్పేస్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ విగ్రహాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకున్న తర్వాతనే, పూజ చేయడం ఉత్తమం. ఇక ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, పగిలిపోయిన లేదా విరిగిపోయిన విగ్రహాలను పూజ మందిరంలో ఉంచకూడదు. వీటివల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపిస్తుంది. వీలైనంత వరకూ ఇలాంటి విగ్రహాలు మీ పూజ మందిరంలో లేకుండా చూసుకోవాలి.
స్టోరేజ్:
సాధారణంగా పూజకు కావలసిన వస్తువులను, పూజ పుస్తకాలను చదువుకోవడానికి చాలా మంది ఎక్కువ అల్మారాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు. ఒక అల్మరా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అది కూడా అల్మరా ఆగ్నేయ దిక్కున ఉండేలాగా చూసుకోవాలి..
చూశారు కదా ! ఇలాంటి పద్ధతులు పాటించి పూజ గదిని నిర్మించడం వల్ల, పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది. ఇక అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవిస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి