ఇటీవల కాలంలో చాలా మంది పని మీద పడి నిద్రపోఏ సమయాన్ని కూడా తగ్గించుకుంటున్నారు. ఇంకొకరకంగా చెప్పాలి అంటే సెల్ ఫోన్ , లాప్టాప్,  టీవీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటిని చూస్తూ కాలక్షేపం చేస్తూ నిద్ర అనే పదానికి కూడా చాలామంది దూరం అవుతున్నారు అని చెప్పాలి.  కానీ మరి కొంతమంది సమయం దొరికితే చాలు నిద్రపోదామా అని ఆలోచించేవారు కూడా ఎక్కువ అవుతున్నారు. అయితే సమయం కోసం ఎదురుచూసి అతిగా నిద్రపోయే వారిలో మీరు కూడా ఒకరైతే తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. తక్కువ నిద్రపోవడం ఎంత అయితే సమస్యను తెచ్చి పెడుతుందో.. ఎక్కువగా నిద్ర పోవడం కూడా అంతే సమస్యలకు దారి తీస్తుందట.

ముఖ్యంగా అవసరానికి మించి నిద్రపోయేవారు అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారట. ఇక అసలు విషయం ఏమిటంటే.. సాధారణంగా తలనొప్పిగా ఉన్నప్పుడు మనం కొద్దిసేపు పడుకుంటే కొద్దిగా రిలీఫ్ వస్తుంది. ఒకవేళ తలనొప్పికి నిద్ర ఓ నాచురల్ మెడిసిన్ లో పనిచేస్తుందని చెప్పవచ్చు. అదే నిద్ర తలనొప్పికి కారణం అవుతుందంటే ఎవరైనా నమ్మగలరా.. ఒక్కొక్కసారి మీకు కలిగిన అనుభవాలను జ్ఞాపకం తెచ్చుకుంటే అవుననే అంటారు. ఇక ఎప్పుడైనా సరే మనం ఫ్రీ టైం దొరికినప్పుడల్లా నిద్రపోతూ ఉంటే ఎక్కువగా తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాదు తరచూ ఎక్కువగా నిద్రపోయే వాళ్ళు ఎప్పుడూ బద్దకంగా,  నీరసంగా ఉంటారు. వారిలో ఏమాత్రం ఆక్టివ్నెస్ కనిపించదు. ఇక ఏ పని చేయాలన్నా మీరు వెనుకడుగు వేస్తూ ఉంటారు. అంతేకాదు ఎక్కువగా నిద్ర పోవడం వల్ల మెదడు కూడా మొద్దు బారిపోతుంది. ఫలితంగా ఆలోచన శక్తి , జ్ఞాపకశక్తి రెండూ కూడా తగ్గిపోతాయి. అంతేకాదు ఖాళీ సమయం దొరికితే నిద్రపోయే వారికి ఎక్కువగా మధుమేహం, గుండెపోటు, అధిక బరువు, వెన్నునొప్పి , డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురవుతాయట. కాబట్టి మీకు ప్రతి సారీ నిద్ర వస్తుంది అంటే ఏదైనా బుక్ చదవడం లేదా ఏదైనా పనిలో నిమగ్నం అవ్వడం లాంటివి చేస్తే నిద్ర రాదు అని కేవలం రాత్రి సమయంలో మాత్రమే ఎనిమిది గంటల పాటు తప్పకుండా నిద్రపోవాలి అని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: