పీరియడ్స్‌లో తినకూడని ఆహారాలు:
అధిక ఉప్పు ఉన్న ఆహారం: ఎక్కువ ఉప్పు తింటే శరీరంలో నీరు నిల్వై పొట్ట ఉబ్బరం, వాపు పెరుగుతుంది. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు బ్లోటింగ్ ఎక్కువై అసౌకర్యంగా ఉంటుంది.
అధిక చక్కెర కలిగిన పదార్థాలు : మిఠాయిలు, కూల్‌డ్రింక్స్, బేకరీ ఐటమ్స్ లాంటివి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి, మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతాయి.
ఈ పదార్థాలు తాత్కాలికంగా ఎనర్జీ ఇచ్చినా తర్వాత అలసటను పెంచుతాయి.
ప్రాసెస్ చేసిన మరియు జంక్ ఫుడ్ :ప్యాకేజ్డ్ ఫుడ్, రెడీ టు ఈట్ ఐటమ్స్, ఫ్రైడ్ స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్‌ల్లో అధిక ఉప్పు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి హార్మోన్లను అసమతుల్యం చేసి, కడుపులో అసౌకర్యాన్ని పెంచుతాయి.
ఎర్ర మాంసం (రెడ్ మీట్): ఎర్ర మాంసంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పీరియడ్స్ నొప్పిని మరింత పెంచుతాయి. వాపు మరియు కడుపునొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంది.
కెఫైన్ కలిగిన పానీయాలు: కాఫీ, టీ ఎక్కువగా తాగితే రక్త నాళాలు కుదించబడతాయి, దీంతో కడుపునొప్పి ఎక్కువ అవుతుంది. కెఫైన్ శరీరంలో నీటిని తగ్గించి డీహైడ్రేషన్‌కి దారితీస్తుంది.
ఆల్కహాల్ :ఆల్కహాల్ తాగితే హార్మోన్ల స్థాయిలు అసమతుల్యం అవుతాయి. డీహైడ్రేషన్, మూడ్ స్వింగ్స్, అలసట మరింత పెరుగుతాయి.
గ్యాస్ పానీయాలు మరియు కోల్డ్‌డ్రింక్స్:వీటివల్ల కడుపులో గ్యాస్ పెరిగి ఉబ్బరం ఎక్కువ అవుతుంది.
పీరియడ్స్‌లో తినదగ్గ హెల్దీ ఫుడ్ ఆప్షన్స్:
పండ్లు మరియు తాజా జ్యూస్‌లు
విటమిన్ ఛ్, ఐరన్, పొటాషియం అధికంగా ఉన్న పండ్లు (అరటి, ద్రాక్ష, నారింజ, బొప్పాయి) తినడం వల్ల శరీరానికి ఎనర్జీ లభిస్తుంది.
ఆకుకూరలు: ఐరన్ లోపం ఉన్నవాళ్లకు ఆకుకూరలు చాలా మంచివి. రక్తనష్టం వల్ల వచ్చే బలహీనతను తగ్గిస్తాయి.
ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం: పప్పులు, మిల్లెట్స్, కూరగాయలు తీసుకోవడం వల్ల జీర్ణం సులభంగా అవుతుంది.
డ్రై ఫ్రూట్స్:బాదం, కాజూ, వాల్‌నట్స్‌లో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు హార్మోన్‌లను సమతుల్యం చేస్తాయి.
గుడ్లు, పాలు, పెరుగు:ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉండే ఈ ఆహారాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
*పీరియడ్స్‌లో పాటించాల్సిన అదనపు జాగ్రత్తలు:
ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. వ్యాయామం తక్కువగా చేసి శరీరానికి సపోర్ట్ ఇవ్వాలి. స్ట్రెస్ తగ్గించే మెడిటేషన్, శ్వాస వ్యాయామాలు చేయాలి. డీహైడ్రేషన్ నివారించడానికి తగినంత నీరు తాగాలి. సరిగ్గా నిద్రపోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి