ఆ నలుగురు సినిమాకు చంద్రసిద్ధార్థ 2004లో దర్శకత్వం వహించగా, ఈ సినిమాను సరిత పట్రా నిర్మించారు. ఇక ఈ కథను మదన్ అద్భుతంగా  చిత్రీకరించాడు.  ఆ నలుగురు సినిమా కథా ఎంతో ప్రతిష్టాత్మకంగా  నిర్మించిన ఈ చిత్రం లో రాజేంద్ర ప్రసాద్ నటన అపూర్వమైనది. మనం ఎంత బాగా జీవించినా,ఎంత ధనం సంపాదించినా మనకు కావాల్సింది నా అనే నలుగురు మనుషులు  . అనే మూల సిద్ధాంతం మీద తీసి, ఉత్తమ చిత్రం కేటగిరీలో నంది అవార్డును కూడా పొందారు. అయితే ఈ సినిమా కథ ఒక రియల్ లైఫ్ ద్వారా తీసుకున్నది. అది ఎలా తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..


పూర్తి వివరాల్లోకి వెళితే డైరెక్టర్ మదన్ తన వ్యక్తిగత పనుల కోసం మదనపల్లి కి వెళ్ళినప్పుడు,అక్కడ కొత్తకోట అనే గ్రామంలో జరిగిన ఒక సంఘటన డైరెక్టర్ మదన్ ను కదిలించింది. ఊరంతా అప్పులు చేసిన ఒక వ్యక్తికి, దహన సంస్కారాల కోసం ఊరంతా వచ్చి, అతడు చేసిన అప్పుల గురించి కాకుండా అతడు చేసిన గొప్పల గురించి చెప్పుకోవడం చూశాడు. ఆ వ్యక్తి ఆ గ్రామంలో ఎన్ని అప్పులు చేసినప్పటికీ, మనుషులలో ఆప్యాయత, అనురాగాలను  పెంచుకున్నాడు. ఇక ఆ మంచితనమే అతడికి చిరకాలం పాటు వర్ధిల్లింది. ఈ సంఘటన చూసిన మదన్ ఇదే ఇతివృత్తాన్ని కథగా తీసుకొని, డబ్బు కన్నా మానవ విలువలు గొప్పవని కథ రాసుకున్నాడు.

అయితే ఈ సినిమాకు మొదట అంతిమయాత్ర అనే టైటిల్ పెట్టారు. అయితే ఈ కథ ను మొదట సినిమాలాగా కాకుండా సీరియల్ లో ప్రచురించాలని  ఈటీవీ బృందం వారిని వెళ్ళి అడిగారు మదన్ . కానీ ఈటీవీ బృందం వారు ఈ కథను రిజెక్ట్ చేయడంతో, ఈ కథకు ఇంకాస్త డెవలప్ చేసి,భాగ్యరాజా దగ్గరికి వెళ్తే, ఆయన తెలుగు,తమిళ్ లో కూడా నేనే చేస్తాను,మోహన్ బాబు అయితే ఈ కథకు సరిపోతారు అని అన్నాడు. కానీ ఏ కారణం, చేతనో ఈ ప్రాజెక్టు పక్కన పడిపోయింది.

ఇక ఇదే కథను మదన్,ప్రకాష్ రాజు దగ్గరకి వెళ్లి చెబితే, కథ బాగుంది కానీ, ఇది సినిమాగా వర్కౌట్ అవదు అని చెప్పాడు... ఇలా ఎన్నో కష్టాలు పడితే,చివరకు ఈ కథను తన స్నేహితుడు చంద్రసిద్ధార్థ్ కి వినిపించడంతో సిద్ధార్థ తన ఫ్రెండ్స్ సహాయంతో తానే స్వయంగా నిర్మించడానికి సిద్ధమయ్యాడు. ఇక వీరిద్దరూ కలిసి ఈ కథను రాజేంద్రప్రసాద్ కు వినిపించగా, ఆయన తీవ్ర దుఃఖానికి గురి అయ్యి, నేను ఈ పాత్రకు చేస్తాను. అందుకు కావాల్సిన హావభావాలను, నేను మార్చుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు రాజేంద్రప్రసాద్. ఇక తర్వాత హీరోయిన్ గా ఆమనీ ఎంచుకోగా, సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ లను ఎంచుకున్నారు.

ఇక ఆ తర్వాత ఈ సినిమా టైటిల్ ను అంతిమయాత్ర నుండి ఆ నలుగురు గా పేరు మార్చారు. ముప్పై ఎనిమిది రోజుల్లో ఒక కోటి 20 లక్షల బడ్జెట్ తో 2004 లో విడుదలయింది. ఎంతో ఆశతో తెరకెక్కించిన ఈ చిత్రం, మొదటి రెండు వారాలు థియేటర్స్ మొత్తం ఖాళీ అయ్యాయి. సగానికి పైగా బాక్సులు కూడా రిటర్న్ వచ్చాయి. కానీ నిరాశే మిగిలింది, అనుకున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా సినిమా థియేటర్లు అన్ని ఫుల్ అయిపోయి,పెట్టిన బడ్జెట్ కు రెండింతలుగా లాభం వచ్చింది. ఉత్తమ చలనచిత్రం అవార్డుతోపాటు,ఉత్తమ నటుడు రాజేంద్ర ప్రసాద్ ,ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కోట శ్రీనివాసరావు లు నంది అవార్డులు అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: