టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాల కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.లెజెండరీ హీరో తెలుగు సినిమాకి మొదటి హీరో అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తనయుడిగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు అలాగే ఓ ప్రత్యేక బ్రాండ్ ని సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీకి ఎంత మంది హీరోలు వున్న బాలయ్యకి వున్న క్రేజ్ వేరని చెప్పాలి. ముఖ్యంగా ఆయన డైలాగులు థియేటర్లలో ప్రతి హీరో అభిమాని చేత అరుపులు పెట్టించడం ఖాయం. బాలయ్య అంటేనే ఒక ఎనర్జీ.బాలయ్య సినిమాలో ఏమున్నా లేకున్నా ఆయన డైలాగులు ఉంటే చాలు సినిమా హిట్ అయిపోయినట్టే. ఎన్నో సినిమాలని కథతో సంబంధం లేకుండా తన ఒంటి చేత్తో హిట్ అయ్యేలా చేశాడు.

ఇక బాలయ్య కెరీర్ లో ఫ్యాన్స్ కి గుర్తుండిపోయే సినిమాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది నరసింహ నాయుడు గురించి చెప్పుకోవాలి.బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు తిరగ రాసింది.ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా తరువాత వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చెన్న కేశవ రెడ్డి కూడా అప్పట్లో ఒక ఊపు ఊపింది.

ఇక ఆ తరువాత జయంత్ సి పరాంజి దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి నరసింహ సినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ సినిమా కూడా ఫ్యాన్స్ ని ఎంతగానో మెప్పించింది. ఇక ఈ సినిమాలాన్నిటికీ కూడా మణిశర్మ మ్యూజిక్ అందించడం విశేషం. మణిశర్మ అందించిన పాటలు అప్పట్లో తెగ హిట్ అయ్యాయి.

ఇక బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు మళ్ళీ వింటేజ్ బాలకృష్ణ ని చూపించాయి. ఈ రెండు సినిమాలు కూడా ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా లెజెండ్ సినిమా అయితే ఎప్పటికి ఓ మరుపురాని చిత్రంగా నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాలు అన్ని కూడా బాలయ్య ఫ్యాన్స్ కి ఎన్నడూ గుర్తుండిపోయే చిత్రాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: