బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ పూనమ్ పాండే. ఇక ఈ హాట్ బ్యూటీ నగ్న వీడియోలతో అందాల ప్రదర్శన చేస్తూ కుర్ర కారుల మతులు పోగొడుతుంది. ఇక ఈ హాట్ బ్యూటీకు వివాదాలు సృష్టిస్తూ వార్తల్లో నిలవడం కొత్తేమీ కాదు. ఇక ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో కూడా తన హాట్ హాట్ ఫొటో షూట్స్ షేర్ చేస్తూనే తాను ఏదైతే చెప్పాలని అనుకుంటుందో అది ఓపెన్‌గా మాట్లాడేస్తుంటుంది. ఇక ఉన్నటుండి గత లాక్‌డౌన్ వేళ తన ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఈ హాట్ బ్యూటీ.. తాజాగా తన ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందిస్తూ అందరికి స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. ఇక కామెంట్స్ చేసే అందరికీ అర్థమయ్యేలా ఒక్క మాటలో పూనమ్ పాండే అంతా బయటపెట్టింది.ఇక గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో తన ప్రియుడు శామ్ బాంబేను పెళ్లాడింది ఈ హాట్ బ్యూటీ పూనమ్ పాండే.

ఇక ఆ తర్వాత వీళ్లిద్దరి వ్యవహారం తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.పెళ్లి జరిగిన తరువాత కొన్ని రోజులకే తన భర్త హింసిస్తున్నాడంటూ గృహ హింస కేసు పెట్టిన పూనమ్..ఇక అతని శారీరక వేధింపుల కారణంగా హాస్పిటల్ పాలయ్యానని కూడా ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది.మళ్ళీ ఇంతలో సడెన్‌గా యూటర్న్ తీసుకొని తన భర్త చాలా మంచివాడని పేర్కొంటూ ఆ కేసుని వెనక్కి తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరూ దాంపత్య జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.అయితే గత కొన్ని రోజుల నుంచి పూనమ్ పాండే గర్భవతి అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక పూనమ్‌ పాండే- శామ్ బాంబే దంపతులు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని బాలీవుడ్ లో జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఘాటుగా రియాక్ట్ అయింది పూనమ్ పాండే. ఇక తప్పుడు వార్తలతో తనను బలవంతంగా గర్భవతిని చేయకండి అంటూ పూనమ్ పాండే షాకింగ్ కామెంట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: