
• CSKకు గెలుపు ఒక్కటే శరణ్యం
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) విషయానికొస్తే.. ఈ సీజన్‌లో వారి ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం 2 గెలిచి, 6 ఓడిపోయారు. వారి ఖాతాలో ఉన్నది కేవలం 4 పాయింట్లు మాత్రమే. ఇక వారికి మరో 6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్లేఆఫ్స్ చేరాలంటే.. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ CSK కచ్చితంగా గెలవాలి. అలా జరిగితే వారికి 16 పాయింట్లు వస్తాయి.
సాధారణంగా ఐపీఎల్‌లో 16 పాయింట్లు వస్తే.. దాదాపు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమైనట్టే. కానీ.. ఇప్పుడు CSK ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవడానికి లేదు. ఒకవేళ ఒక్క మ్యాచ్ ఓడినా.. 14 పాయింట్లతోనే ఆగిపోతుంది. అప్పుడు నెట్ రన్ రేట్ తో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ఇకపై CSK ఆడే ప్రతి మ్యాచ్ వారికి ఫైనలే.
• RR పరిస్థితి కూడా సేమ్ టూ సేమ్
సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే ఉంది రాజస్థాన్ రాయల్స్ (RR). వాళ్లు కూడా సేమ్ టూ సేమ్.. ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్‌ల్లోనూ గెలిచి తీరాలి. అలా జరిగితేనే వారికి 16 పాయింట్లు వస్తాయి. లేదంటే ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. 12 లేదా 14 పాయింట్లతో ఆగిపోతే.. అప్పుడు CSK లాగే NRR, ఇతర జట్ల రిజల్ట్స్ వైపు చూడాల్సిందే. వారి ప్లేఆఫ్స్ దారి కూడా ముళ్ల బాటే.
ఇక ముందున్న కీలకమైన మ్యాచ్‌లు చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ ఏప్రిల్ 24న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ గత సీజన్ ఫైనలిస్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో ఏప్రిల్ 25న ఢీకొంటుంది. అత్యంత కీలకమైన మ్యాచ్‌ల్లో ఒకటిగా మే 12న CSK, RR మధ్య జరగబోయే మ్యాచ్‌ను చెప్పొచ్చు. అప్పటికి ఈ రెండు జట్లూ ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంటే.. అది కచ్చితంగా డూ ఆర్ డై పోరే అవుతుంది.