
ఒకప్పుడు రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం మధ్య వచ్చిన చీలిక కారణంగా.. టీడీపీ మహత్తర విజయాన్ని దక్కించుకుంది. కమ్మలు ఇప్పటికీ.. టీడీపీ వైపే మెజారిటీగా నిలబడుతున్నారు. దీనికి కార ణాలు ఉన్నాయి. వారిని రాజకీయంగా చైతన్యం చేయడంతోపాటు.. పదవులు.. అధికారాల విషయంలో నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వరకు.. మెజారిటీ పాత్ర పోషించారు. ప్రధానంగా రెడ్డి ఆధిపత్య రాజకీయాలు కొనసాగిన సమయంలో కమ్మ ఆధిపత్య రాజకీయాలకు పురుడు పోశారు.
ఇలా చూసుకుంటే.. రాష్ట్రంలో కాపుల పరిస్థితి ఏంటి? అనేది చర్చకు వచ్చే అంశం. 2014కు ముందు కూడా.. కాపులు రాజకీయ వస్తువుగానే పరిగణించే పరిస్థితి ఉంది. 2007లో పుట్టిన ప్రజారాజ్యంతో స్పష్టమై న విభజన కనిపించింది. కాపులు ఆ పార్టీకి అనుకూలంగా మారిపోయారు. అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉ న్న వంగవీటి రాధా.. టీడీపీలో ఉన్న గంటా శ్రీనివాసరావుతో పాటు పదుల సంఖ్యలో ఉన్న నాయకులు కూడా.. ప్రజా రాజ్యం వైపు మొగ్గు చూపారు. చిరంజీవిని భుజాన వేసుకున్నారు.
అయితే.. నాటి ఫలితాల్లో 18కి మించని సీట్ల కారణంగా.. ఈ పార్టీ తర్వాత కాలంలో కాంగ్రెస్‌లో విలీనం అయిపోయింది. అంటే.. ఇక్కడ ప్రధాన అంశం.. కాపుల కోసం పుట్టిన పార్టీగా చెప్పుకొన్న ప్రజారాజ్యం.. వారికి ఆదరువుగా నిలవలేదన్నది.. వాస్తవం. దీంతో 2014 వరకు కాపులకు ప్రత్యేకంగా గుర్తింపు కానీ.. ప్రత్యేక రాజకీయ అవనిక కానీ లభించలేదు. అయితే.. కాపుల కోసం నిలబడిన వారు.. మాత్రం ఉన్నారు. హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటివారు కాపుల కోసం, వారి భవితవ్యం కోసం ప్రయత్నాలు చేశారు.
అయితే.. వీరి తాలూకు ప్రభావం ఉన్నా.. అది ఒకటి రెండు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. అనంతర కాలంలో కాపులను స్థిరమైన ఓటు బ్యాంకుగా గుర్తించింది వైసీపీనే. అప్పటికి టీడీపీ ఉన్నా.. సంఖ్యా పరం గా కాపులు తక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. వైసీపీ ఎప్పుడైతే.. కాపులను మచ్చిక చేసుకుని చేర దీయడం ప్రారంభించిందో 2014-19 మధ్య టీడీపీ కూడా.. అదే పనిచేసింది. ఈ క్రమంలోనే ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్‌లో గుండుగుత్తగా 5 శాతం కాపులకు ఇచ్చేసింది.
కానీ.. ఇది వివాదానికి దారితీసింది. ఇక, కాపులకు మంత్రి పదవులు ఇచ్చారు. అయినా.. ఎక్కడో దాగి ఉన్న అసంతృప్తి.. కాపులకు రిజర్వేషన్ కల్పించాలన్న సుదీర్ఘ కాలపు డిమాండ్ మాత్రం అలానే ఉండిపో యింది. పైగా తునిలో జరిగిన రైలు దుర్ఘటన ఉదంతం తర్వాత.. కాపులను నేరస్తులుగా చూసే సంప్రదా యం తయారైంది. ఇది నాటి టీడీపీకి ఇబ్బందిగా మారింది. పైగా.. ముద్రగడ ప్రారంభించి కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని కూడా.. దారి తప్పించేలా కొందరు చేసిన రాజకీయం కూడా.. కాపులను ఒంటరులను చేసిందనే చెప్పాలి.
ఇది 2019 ఎన్నికల్లో వైసీపీకి కలిసి వచ్చింది. కాపు ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవడంలోనూ.. ముద్రగడ వంటి సీనియర్లను తన వైపు మలుచుకోవడంలోనూ.. వైసీపీ సక్సెస్ అయింది. మంత్రివర్గంలో పదువు లు కూడా ఇచ్చారు. కార్పొరేషన్‌ను కూడా బలోపేతం చేశారు. కానీ, ఇవి కూడా పైపైమెరుగులుగానే మారా యి. మంత్రి పదవులు దక్కించుకున్న పేర్ని నాని, ఆళ్ల నాని.. సహా కాపు నాయకులు.. అధికారం లేక పోవడంతో తాడేపల్లి అనుమతుల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. కార్పొరేషన్ కు నిధులు ఇవ్వకపోవ డం.. మరో మైనస్.
అదే సమయంలో తమ రిజర్వేషన్ వ్యవహారంపై జగన్ సుదీర్ఘకాలం తేల్చకుండా ఉంచేయడం.. వంటివి కూడా.. కాపుల సమస్యలకు పరిష్కారం చూపించలేక పోయాయి. ఇతమిత్థంగా చెప్పాలంటే.. కాపులను రాజకీయ పార్టీలు.. ఒక ఓటు బ్యాంకుగానే చూసుకున్నాయి. టీడీపీ వైపు వెళ్లకుండా వైసీపీ, వైసీపీ వైపు వెళ్లకుండా టీడీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో కాపులను కట్టడిచేసే ప్రయత్నాలు సాగాయి. ఇలాంటి సమయంలో చీకటిలో చిరు దివ్వె మాదిరిగా.. కాపుల పక్షాన అని నేరుగా చెప్పకపోయినా.. ప్రశ్నిస్తానంటూ.. వచ్చిన జనసేన పార్టీపై కాపులకు అంచనాలు పెరిగాయి.
అయినప్పటికీ.. తాను చేగువేరా శిష్యుడినని.. తనకు కులాలు మతాలు లేవని పవన్ ప్రకటించిన దరిమి లా.. 2019లో కాపులు ఆయనను విశ్వసించలేక పోయారన్నది వాస్తవం. కానీ, 2019-24 మధ్య వైసీపీ చేష్ఠలుడిగిన రాజకీయాలు చూసిన తర్వాత.. కాపులు గుండుగుత్తగా.. జనసేనకు మద్దతు ప్రకటించారు. తమకు ఏదో జరుగుతుందని అనుకున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు కూడా అలానే ఉంది! పరిస్థితిలో మార్పు రాలేదు. పాలనలో వచ్చిన మార్పు.. అధికార పీఠాల్లో వచ్చిన మార్పులు.. కాపుల్లో కనిపించడం లేదు. పవన్ డిప్యూటీ సీఎం అయినా.. కందుల దుర్గేష్ మంత్రి అయినా.. కాపుల సమస్యలు మాత్రం రాజకీయ బీరువాల్లో మూలుగుతూనే ఉన్నాయి. దీంతో కాపులు ఇప్పటికీ ఓటు బ్యాంకుగానే నిలిచిపోయారు.
అసలు కాపులు ఏం కోరుకుంటున్నారు?
+ తమకు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్ ఇస్తే చాలు.
+ అధికారంలో కీలకమైన శక్తిగా ఎదిగే అవకాశం రావాలి.
+ పేదరికంలో మగ్గుతున్న కాపులకు అండగా ఉండే పథకాలు కావాలి.
+ నాయకత్వం ఎవరు వహించినా.. కాపుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే నాయకులు కావాలి. ఇంతకు మించి.. కాపు జనాభా కోరుతున్నది ఏమీలేదు. చిత్రం ఏంటంటే.. కాపులకు ఇవన్నీ చేశారో..లేదో.. చెప్పలేం కానీ.. వారి తరఫున బలమైన గళం వినిపించడంలో ముందున్న వ్యక్తిగా.. ఇప్పటికీ వంగవీటి రంగా పేరు స్థిరంగా నిలిచిపోయింది. సో.. కాపులకోసం.. కాపుల చేత.. కాపుల వలన.. అన్నట్టుగా.. వారి తలరాతలు మార్చే నాయకుల గ్యాప్ అలానే ఉండిపోయిందనడంలో సందేహం లేదు.
కాపు సోదరులారా.. రండి.. ఉద్యమించండి..!
రాష్ట్రంలో కాపు సోదరులు.. రాజకీయ పార్టీలకు ఆటవస్తువుగా మారిపోయారనడంలో సందేహం లేదు. అన్నీ పార్టీలకు కాపులు ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నా వారికి రాజ్యాధికారం లేదు.. ఎన్నో విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాపు సోదరులు తమ రాజకీయ, సామాజిక సమస్యలను వినిపించాలనుకుంటే మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.