యూనివర్సల్ స్టార్‌ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఇండియన్‌ సినిమా స్థాయిని ప్రపంచస్థాయిలో గర్వించేలా చేస్తున్న నటీమణుల్లో ప్రియాంకా చోప్రా ఒకరని అందరికి బాగా తెలిసిన విషయమే . ప్రస్తుతం ప్రియాంకకు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు లభిస్తున్నాయి.అంతే కాకుండా ఈమె పెళ్లి చేసుకున్నది కూడా హాలీవుడ్ కంపోజర్ మరియు నటుడు అయిన నిక్ జోనస్‌ను. పెళ్లి జరిగిన తర్వాత తన భర్తతో లండన్‌లోనే సెటిల్ అయిపోయింది ఈ యూనివర్సల్ బ్యూటీ.

తనను అస్సలు ఎవరేమనుకున్నా సరే చాలా ముక్కుసూటిగా మాట్లాడటం ప్రియాంకకి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు.ఎంతటి నిజాన్ని అయిన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పటం ఆమె నైజం. తాజాగా ఈమె తన జీవితంలోని జరిగిన కొన్ని విశేషాలతో పాటు కొన్ని సీక్రెట్ లను కూడా తెలియజేస్తూ un finished అనే ఓ పుస్తకం రాసినట్లు సమాచారం. ఆ పుస్తకంలో చాలా పర్సనల్‌ విషయాలను కూడా ప్రియాంక వెల్లడించినట్లు సమాచారం. తన పదో తరగతి చదువుతున్న సమయంలో జరిగిన ఓ ఆసక్తి కరమైన సంఘటను కూడా చెప్పినట్లు సమాచారం.

ప్రియాంక తాను పదోతరగతి చదువుతున్న సమయంలో ఆమెకు ఓ బాయ్‌ఫ్రెండ్‌ ఉండేవాడని సమాచారం. తన పేరు బాబ్‌ అని చెప్పిందట. తన చిలిపితనం చూసి ప్రియాంక బాబ్ ప్రేమలో పడిపోయిందని సమాచారం.అతడినే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నానని ప్రియాంక చెప్పిందట అతనితో రొమాన్స్‌ చేస్తూ తన ఇంట్లో వాళ్ళకి దొరికిపోయినట్లు కూడా తాను చెప్పినట్లు సమాచారం.

ఓక రోజు తన ఇంట్లో ఎవరూలేని సమయంలో అతను మా ఇంటికి వచ్చాడు అని చెప్పిందట. వారి ఇద్దరు కలిసి టీవీ చూస్తుండగా అకస్మాత్తుగా ప్రియాంక ఆంటీ రావడంతో అతన్ని గదిలో ఒక చోట దాచి పెట్టిందట. తన ఆంటీని బయటకి పంపేంత వరకు లోపలే ఉండాలని తన బాయ్ ఫ్రెండ్‌కు చెప్పిందట.కానీ తన అంటీకు అనుమానం వచ్చి అల్మారాను తెరిచి చూడడంతో అక్కడ జరుగుతున్నఅసలు విషయం బయటపడిందట . దీంతో ఆమె ఆంటీ బాగా సీరియస్‌ అయిందట. తన జీవితంలో తన ఆంటీ అంత కోపంగా ఉండటం తాను ఎప్పుడూ చూడలేదట'. ఈ విషయం మొత్తం ఆ పుస్తకంలో రాసుకొచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: