సినీ, మోడలింగ్ వరల్డ్‌లో రాణించాలంటే అందంతో పాటు శరీర ఆకృతి అతి ముఖ్యమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, అందం, ఆకృతి ఉన్నప్పటికీ అవకాశాలు రాక అలానే ఉండిపోయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలోనే అందం, ఆకృతి కోసం సర్జరీలు చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు. కాగా, ఈ సర్జరీలు వికటించి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. కాగా, ఫ్లోరిడాకు చెందిన మోడల్ సమస్య మిగతా వారి కంటే కూడా డిఫరెంట్ అని చెప్పొచ్చు.
అందరిలాగానే ఆమె కూడా శరీర ఆకృతి మార్చుకోవాలనుకుంది. ఇందుకుగాను సర్జరీ చేయించుకుంది. దాదాపు రూ.14 లక్షలతో సర్జరీ చేయించుకుంది. అయితే, దురదృష్టవశాత్తు ఆ సర్జరీ ఫెయిల్ అయింది. దాంతో ఆమె ఇప్పుడు కూర్చోవాలంటేనే భయపడిపోతోంది. ఆమె ఎవరంటే.. 24 ఏళ్ల కజుమీ స్క్విర్ట్స్ ఇన్ స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌ను ఆకట్టుకోవడం కోసం తన పిరుదులు ఎత్తుగా కనిపించేలా సర్జరీ చేయించుకుంది. అయితే, అది ఫెయిల్ అయిపోయింది. ఈ విషయమై కజుమీ మాట్లాడుతూ సరైన శరీరాకృతి కోసం ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నానని, సంప్రదాయమైన డైటింగ్ వ్యాయామాలు చేయడం ద్వారా ఆ కోరిక తీర్చుకోవాలని అనుకున్నానని తెలిపింది.
అయితే, అలా సాధ్యం కాకపోవడంతో సర్జరీ బాట పట్టానని చెప్పింది. సర్జరీ ద్వారా తన వక్షోజాలను పెంచుకున్నానని, ఆ తర్వాత బట్ లిఫ్ట్ సర్జరీ చేయించుకున్నానని చెప్పింది. అయితే, తాను ఆశించిన ఫలితం తనకు రాలేదని, సర్జరీ విజయవంతం కాలేదని చెప్పింది. ఈ నేపథ్యంలోనే తాను కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నానని పేర్కొంది. ఏ పని చేసినా నిలబడి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించింది ఈ భామ. అయితే, ఆమె కూర్చోలేకపోయినా ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఫ్యాన్స్ పేజెస్ ద్వారా బాగానే డబ్బులు సంపాదిస్తోంది. తనకు ఒకప్పుడు నెలకు 25 వేల డాలర్లు మాత్రమే లభించేవని, కానీ, సర్జరీ తర్వాత 2 లక్షల డాలర్లు వస్తున్నాయని చెప్పింది ఈ మోడల్.
మరింత సమాచారం తెలుసుకోండి: