మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరం అయ్యాడు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలలోనే జీవితాన్ని గడిపి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'కత్తి' సినిమాను తెలుగులో 'ఖైదీ నెంబర్ 150' గా రీమేక్ చేసి చిరంజీవి బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా నరసింహారెడ్డి' సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసి కుర్ర హీరోలకు నేనేమి తక్కువ కాదు అని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో టాప్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనితో పాటే మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' రీమేక్ గా తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనితో పాటే మెహర్ రమేష్ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన 'వేదాళం' సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న 'బోలా శంకర్' సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. వీటితో పాటే బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి కూడా చిరంజీవి రెడీగా ఉన్నాడు.

 ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి మరో రీమేక్ సినిమాను కూడా లైన్ లో పెట్టాడు అని వార్తలు వస్తున్నాయి. గౌత‌మ్ మీనన్, అజిత్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన 'యెన్నై అరిందాల్' అనే చిత్రాన్ని చూసిన చిరంజీవి దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూనట్లు, దర్శకుడి కోసం ఎదురు చూస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్రబృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: