తెలుగు రాష్ట్రాలలో కోవిడ్ ఒమైక్రాన్ భయాలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ భారీ సినిమాల పై ఉన్న మోజుతో జనం విపరీతంగా ధియేటర్లకు వస్తున్న విషయాన్ని ‘అఖండ’ సూపర్ సక్సస్ రుజువు చేసింది. ఇప్పటికే ‘పుష్ప’ మూవీ పై క్రేజ్ ఏర్పడిన పరిస్థితులలో ‘అఖండ’ కలక్షన్స్ కు మించి సునామీ సృష్టించాలని అల్లు అర్జున్ కలలు కంటున్నాడు.


ఇప్పటికే ‘పుష్ప’ పాటలు అందరికీ విపరీతంగా కనెక్ట్ కావడంతో ఇక ఈమూవీకి ఎదురులేదు అన్న కామెంట్స్ వస్తున్నప్పటికీ ఒక విషయంలో ఈమూవీ ‘అఖండ’ లా ఉండబోదు అన్న సంకేతాలు వస్తున్నాయి. ‘అఖండ’ సూపర్ సక్సస్ లో బాలయ్య అద్భుతమైన నటనతో పాటు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడ అద్భుతంగా రావడంతో బాలకృష్ణ ఉగ్ర రూపానికి ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతగానో సహకరించింది.


‘పుష్ప’ మూవీ సెన్సార్ కార్యక్రమం కూడ పూర్తి అయిన తరువాత ఇప్పుడు ముంబాయ్ లో సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ లు ఏమిచేస్తున్నారు అంటూ ఆరా తీసినప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తున్నట్లు టాక్. ‘పుష్ప’ మూవీలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బాగా లేకపోవడంతో దాన్ని మరింత ఎఫెక్టివ్ గా మార్చి సినిమా ధియేటర్లలో కూర్చున్న ప్రేక్షకులకు మరో ఆలోచన లేకుండా ఆసినిమా పైనే పూర్తిగా దృష్టి ఉండేలా దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ సలహాలను తీసుకుని ఈమూవీలో కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను మార్చే బిజీలో ఉండటంతో వారిద్దరు ‘పుష్ప’ ఈవెంట్ కు రాలేకపోయారు.


‘అఖండ’ మూవీ ఒక ఊహాజనితమైన కథ అఘోర పాత్ర చుట్టూ ఆమూవీ కథ అల్లబడింది కాబట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చెవులు ద్దరిల్లి పోయేలా ఉండాలి అయితే ‘పుష్ప’ కథ వేరు. అందరికీ తెలిసిన శేషాచలం అడవులలో జరుగుతున్న గంధపు చెక్కల స్మగ్లింగ్ ఈ కథను అల్లారు. కథ స్క్రీన్ ప్లే విషయంలో ‘పుష్ప’ లో వెరైటీ కనిపించకపోతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత చెవులు దద్దరిల్లినా జనం మూవీకి టోటల్ పాజిటివ్ టాక్ ఇవ్వరు అన్నది ఎన్నో సార్లు రుజువైంది..



మరింత సమాచారం తెలుసుకోండి: