టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని కి ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేదు జెర్సీ సినిమా హిట్ తర్వాత నాని నటించిన గత చిత్రాలు గ్యాంగ్ లీడర్, వి,టక్ జగదీష్.. ఇలా వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయాయి. అంతే కాదు ముఖ్యంగా వి, జగదీష్ సినిమాల విషయంలో నాని తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నాడు కాబట్టి ఈసారి కచ్చితంగా ఎలాగైనా హిట్ కొట్టాలి అనే ఉద్దేశంతో  శ్యామ్ సింగరాయి అనే సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హీరో డిసెంబర్ 24న విడుదలైన ఈచిత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లనే అందుకుంటోంది.

నిజానికి ఈ సినిమా అనేక అడ్డంకులు నడుమ విడుదలైంది ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు ఏమీ బాగాలేవు ఈ సినిమా కోసం నిర్మాత 55 కోట్లు పెట్టాడు దానికి తోడు నాని గత చిత్రాలన్నీ నిరాశపరిచాడం అంతేకాకుండా పలు సినిమా వేడుకల్లో ఏపీ ప్రభుత్వంపై నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇలా అన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ శాంసంగ్ అనే సినిమాకి భారీ రేంజ్ లో బిజినెస్ జరగలేదు అసలు డిసెంబర్ 24వ తేదీకి ముందు రోజు వరకు ఈ సినిమా విడుదల అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి అయితే నిర్మాత మాత్రం ధైర్యం చేసి ఓన్ రిలీజ్ చేసుకున్నాడు ఇక నాని కూడా తన వంతుగా ఐదు కోట్ల పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేశాడట.

శ్యామ్ సింగరాయి సినిమా కోసం నాని కి ఆఫర్ చేసిన ఎనిమిది కోట్ల రెమ్యూనరేషన్ లో 5 కోట్లు వెనక్కి చేయగా అతనికి మిగిలింది కేవలం మూడు కోట్లు మాత్రమే తన సినిమా ఎలాగైనా థియేటర్లలో విడుదల అవ్వాలి అనేది నాని బలమైన సంకల్పం అందుకోసమే నాని ఈ స్టెప్ తీసుకున్నారని తెలుస్తోంది దీంతో నాని ధైర్యానికి సినీ ప్రముఖులు మెచ్చుకుంటున్నారు మరి నా నీలాగే నిర్మాతలను ఆదుకోవడానికి మిగతా హీరోలు ధైర్యం చేస్తారా అంటే సందేహమే అనే మాట వినిపిస్తోంది. ఏదేమైనా నిర్మాతలను ఆదుకోవడానికి నాని లాంటి హీరోలు ఇండస్ట్రీలో ఇంకా ఉంటే చాలా బాగుంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: