భారత సినీ ఇండస్ట్రీలో విడాకుల వ్యవహారం ఒక సంచలనం సృష్టిస్తోంది.. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఒకరిని చూసి మరొకరు విడాకులు తీసుకొని దాంపత్య జీవితానికి దూరం అవుతున్నారు.. ఇప్పటికే నాగచైతన్య - సమంత లను మొదలుకుని.. ధనుష్ - ఐశ్వర్య , శ్రీజ - కళ్యాణ్ దేవ్ చెప్పుకుంటూ పోతే ఎన్నో జంటలు వైవాహిక బంధానికి దూరమవుతూ అభిమానులకు నిరాశను మిగిల్చారు.. ఇదిలా ఉండగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అయితే వారు ఎప్పుడు ప్రేమలో పడతారో.. ఎవరిని పెళ్లి చేసుకుంటారో తెలియదు కానీ సంతోషంగా జీవిస్తున్నారు అని అనుకునే లోపే అర్ధాంతరంగా విడాకులు తీసుకుంటూ భర్తకు లేదా భార్యకు దూరమవుతున్నారు.


ఇక ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ కూడా  వాలెంటైన్స్ డే కి ఒక రోజు ముందుగా తన భర్తతో విడిపోతున్నట్లు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. హిందీలో బిగ్ బాస్ సీజన్ 14 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న రాఖీ సావంత్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది. అయితే ఈ విషయాన్ని నిన్న రాత్రి అనౌన్స్ చేయడంతో అభిమానులను తీవ్రంగా చింతిస్తున్నారు. ఇకపోతే ఈమె బిగ్ బాస్ షో తర్వాత తన భర్తతో కొన్ని విభేదాలు రావడంతో ఆ కారణంగానే విడిపోతున్నాం అని స్పష్టం చేసింది. తమ మధ్య ఏర్పడిన గొడవలకు శక్తికి మించి ప్రయత్నించినా ఫలితం దక్కలేదని అందుకే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు.. అందుకు తగ్గట్టుగానే విడిపోయామని ప్రకటించింది.


ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రియమైన అభిమానులారా.. నేను.. నా భర్త రితేష్ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాము. బిగ్ బాస్ షో తర్వాత మా ఇద్దరి మధ్య తెలియకుండానే గొడవలు వచ్చాయి కానీ పరిష్కరించుకోలేని గొడవలు రావడంతో విడిపోతున్నాం. ఇక మీదట మేము ఇద్దరం విడివిడిగా మా జీవితాలను కొనసాగించాలని అనుకుంటున్నాము. వాలెంటైన్స్ డే కు ఒక రోజు ముందుగా ఈ విషయాన్ని వెల్లడించడం చాలా బాధగా ఉంది. కానీ ఈ నిర్ణయం తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది. ఏదేమైనా రితేష్ తన జీవితంలో చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక నేను కూడా పరిస్థితులకు అలవాటు పడి ఆరోగ్యంగా , సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.. ఎల్లప్పుడూ నన్ను అర్థం చేసుకుని నాకు మద్దతు ఇస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు అంటూ  ఒక సుదీర్ఘ పోస్ట్ చేసింది.


రాఖీ సావంత్ బిగ్ బాస్ సీజన్ 14 లో పాల్గొన్నప్పుడు పరిచయం ఏర్పడింది. అయితే రితేష్ కు ముందుగానే ఏడు సంవత్సరాల కొడుకు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని దాచి పెట్టి రాఖీ సావంత్ ను వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి చెల్లదని మొదటి భార్య అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: