నాచురల్ స్టార్ నాని గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  నాచురల్ స్టార్ నాని ఎన్నో విజయవంతమైన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు.  ఇప్పటివరకు నాని నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి.  నాని నటించిన విజయవంతమైన సినిమాల్లో నేను లోకల్ సినిమా ఒకటి. నేను లోకల్ సినిమా 2017 ఫిబ్రవరి 3 వ తేదీన భారీ అంచనాలతో ధియేటర్ లలో విడుదల అయ్యింది.

 నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన నేను లోకల్ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.  ఫ్యామిలీ ఎమోషన్స్ తో కామెడీని మిక్స్ చేస్తూ తెరకెక్కిన ఈ ప్రేమ కథ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.  ఇలా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన నేను లోకల్  మూవీ ప్రస్తుతం యూట్యూబ్ లో అదిరిపోయే వ్యూస్ ను సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా యూట్యూబ్ లో నేను లోకల్ సినిమా కొత్త రికార్డ్ ను సృష్టించింది. 

 ఇప్పటి వరకు నేను లోకల్ మూవీ 100 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.  నాచురల్ స్టార్ నాని కెరియర్ లో యూ ట్యూబ్ వైపు నుంచి అరుదైన  రికార్డ్ ను నేను లోకల్  మూవీ అందించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని అంటే సుందరానికి, దసరా సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అంటే సుందరానికి మూవీలో నాని సరసన నజ్రియా నజీమ్‌ హీరోని గా కనిపించబోతోంది. దసరా సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: