టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో మూవీ లను వదులు కున్న సందర్భాలు ఉన్నాయి . ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న కొన్ని సినిమాల గురించి తెలుసు కుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సమంత హీరోయిన్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దొరికేక్కిన బ్రహ్మోత్సవం సినిమా మొదటగా జూనియర్ ఎన్టీఆర్ వద్దకే వచ్చినట్లు కొన్ని కారణాలవల్ల ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించలేకపోయినట్లు తెలుస్తోంది. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లై సినిమా కథ మొదటగా జూనియర్ ఎన్టీఆర్ వద్దకు రాగా  కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించలేకపోయినట్లు తెలుస్తోంది.

నితిన్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం మూవీ కథ మొదటగా జూనియర్ ఎన్టీఆర్ వద్దకే రాగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన పోయినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ హీరోగా అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నా పేరు సూర్య మూవీ కథ మొదటగా జూనియర్ ఎన్టీఆర్ వద్దకు రాగా కొన్ని అనివార్య కారణాల వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా చేయలేకపోయినట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ మూవీ కథ కూడా మొదటగా జూనియర్ ఎన్టీఆర్ వద్దకు రాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ లో కొన్ని కారణాల వల్ల నటించలేకపోయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: