
అంతేకాదు ఈ సినిమా 3D ఫార్మాట్లో విడుదలవుతోందని ప్రకటించినప్పటికీ కూడా సినిమాపై అంచనాలైతే ఎవరికి పెద్దగా ఏర్పడలేదు. కానీ ఇటీవల యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న హనుమాన్ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల అవ్వగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా కంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్న హనుమాన్ పైనే సినీ ప్రేక్షకులకు భారీ అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే హనుమాన్ ట్రైలర్ చూసి ఆధిపురుషుల్లో కూడా మార్పులు చేస్తున్నారు. అందుకే సినిమా 2024 వాయిదా పడే అవకాశం ఉంది.. అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆది పురుష్ టీం కి అత్యంత సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏమిటంటే.. ఈ చిత్రాన్ని 2024 కి వాయిదా వేస్తారు అనడంపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ప్రస్తుతానికి మేకర్స్ ముందుగా ప్రకటించిన విధంగా 2023 జూన్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా హిందూ మతాన్ని కించపరచకుండా జాగ్రత్తగా సినిమాను తెరకెక్కించాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా 2023లోనే రిలీజ్ చేస్తారా ?లేక వాయిదా వేస్తారా ? అనేది స్పష్టత రావాల్సి ఉంది.