తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు రాజా రాణి మూవీ తో అద్భుతమైన విజయాన్ని తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మూవీ తెలుగు లో కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ తరువాత అట్లీ వరుసగా తళపతి విజయ్ హీరో గా తెరకెక్కిన తేరి , మెర్సిల్ , బిగిల్ మూవీ లకు దర్శకత్వం వహించి భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడి గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ కలిగిన ఈ దర్శకుడు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరో గా తెరకెక్కుతున్న జవాన్ మూవీ.కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో నయన తార , ప్రియ మణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ పై ఇటు హిందీ ప్రేక్షకులు , అటు తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తనకు సంబంధించిన ఒక అద్భుతమైన న్యూస్ ను చెప్పుకొచ్చాడు  తన భార్య నటి ప్రియా గర్భవతి గా ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా అట్లీ తెలియజేశాడు. మేము పేరెంట్స్ అవుతున్నాము అని ప్రకటించేందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం ... ప్రేమ మాకు ఉండాలి అని అట్లీ మరియు అతని భార్య ఇద్దరు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: