
రవితేజ గత రెండు సినిమాలు ఇప్పటికే ఫ్లాప్ కావడంతో ఈ సినిమా తో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారు అయన అభిమానులు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ధమాకా మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. ఈ సినిమాను దర్శకుడు త్రినాథ తిక్కన మాస్ మాస్ రాజ్ అభిమానులను అలరించేలా తీర్చిదిద్దినట్లు కన్పిస్తోంది. అయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ట్రేండింగ్ అవుతున్నాయి.
ఈ సినిమాలోని మాస్ సీన్స్ సినిమాకు హైలెట్ గా ఉండటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. రవితేజ ను గతంలో ఎప్పుడు చూపించని విధంగా ఈ సినిమా లో చూపించబోతున్నారట. మాస్ మహారాజ్ నటన.. శ్రీలీల అందచందాలు.. మాస్ స్టెప్పులు అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్ అందించిన సంగీతం సినిమాకు అడ్వాంటేజ్ మాతుందని ధమకా టీం భావిస్తోంది.మరి రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా క్లైమాక్స్ వేరే స్థాయి లో ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చుడ్డాలి.