మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి కి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండడంతో చిరంజీవి నటించిన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ప్రీ రిలీజ్ బిజినెస్ లు కూడా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా చిరంజీవి ఆఖరుగా నటించిన 5 మూవీ లకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరోగా నటించాడు. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ నిర్మించగా ... రవితేజమూవీ లో ఒక కీలకపాత్రలో నటించాడు. ఈ మూవీ ని రేపు అనగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.


చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన గాడ్ ఫాదర్ మూవీ కి 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.


మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య మూవీ కి 131.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లో రామ్ చరణ్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు.


చిరంజీవి హీరోగా తమన్నా ... నయనతార హీరోయిన్ లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహారెడ్డి మూవీ కి 187.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.


చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఖైదీ నెంబర్ 150 మూవీ కి 89 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: