నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు మరోవైపు షోలతో దూసుకుపోతున్నాడు బాలకృష్ణ. సినిమాలే కాకుండా ప్రస్తుతం బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి  వ్యాఖ్యాతగా కూడా వివరిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఇక బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్ని రోజులు కేవలం హీరోగానే బాలకృష్ణ చాలామందికి తెలుసు.కానీ ఇప్పుడు ఈ షో తో  తనలోని యాంకరింగ్ టాలెంట్‌ను కూడా చూపిస్తూ అలరిస్తున్నాడు బాలకృష్ణ. తనదైన స్టైల్ లో ఈ షో తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. 

అంతే కాదు ఇందులో భాగంగానే ఈ షో కి గెస్ట్లుగా వస్తున్న వారి గురించి అనేక విషయాలను బయటపెడుతున్నాడు. ఈ షో కి స్టార్ హీరోలే కాకుండా రాజకీయ నాయకులు సైతం వస్తున్నారు. అయితే గతంలో బాలకృష్ణ చంద్రబాబును పిలిచి బావతో అతను చెల్లెలికి ఐ లవ్ యు కూడా చెప్పించడం మనం చూసాం. అయితే తాజాగా బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కి మరో రాజకీయ నాయకుడు మరియు టాలీవుడ్ స్టార్ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను గెస్ట్ గా పిలవడం జరిగింది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ని ఇంటర్వ్యూ చేశాడు బాలకృష్ణ.

అయితే తాజాగా జనవరి 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ షో కి సంబంధించిన ఒక ప్రోమో ని కూడా రిలీజ్ చేశారు ఆహా టీం. ప్రోమోని విడుదల చేసిన అనంతరం ఈ షో పై మరింత ఆసక్తి నెలకొంది. ఇలా ఉంటే తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక తాజా అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ ని రెండు పార్ట్ లుగా ప్రసారం చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి భాగాన్ని ఫిబ్రవరి 3న సాయంత్రం విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వార్త విన్న పవర్‌స్టార్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు మొదటిసారిగా బాలయ్య మరియు పవన్ కాంబినేషన్ చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా మరియు నందమూరి అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: