టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని హీరోగా మరియు కీర్తి సురేష్ హీరోయిన్ గా దసరా అనే సినిమా రూపొందుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ను తాజాగా విడుదల చేశారు చిత్ర బృందం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కీర్తి సురేష్ కి సంబంధించిన ఏ ఒక్క క్లిప్ గాని లేదా కీర్తి సురేష్ కానీ ఈ టీజర్ లో కనిపించలేదు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ను విడుదల చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొట్టమొదటిసారి ఎన్నడూ లేని విధంగా నాని తెలంగాణ యాసులో మాట్లాడడమే కాకుండా రస్టిక్ లుక్ లో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు. 

దీంతో మొదటిసారి నాని ఇలా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంటుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నాని అభిమానులు. ఇక ఎప్పుడైతే ఈ సినిమా టీజర్ విడుదలైందో అప్పటినుండి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని తమ అభిప్రాయాలను తమ తమ సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే 15 సెకండ్ల పాటు ఉన్న ఈ టీజర్ లో కీర్తి సురేష్ మాత్రం ఎక్కడా కూడా కనిపించలేదు. ఇక ఈ సినిమాలో నాని ధరణి అని వ్యక్తి పాత్రలో మరియు కీర్తి సురేష్ వెన్నెల అనే యువత పాత్రలో కనిపించనున్నారు.

కాగా ఈ సినిమాలో ప్రతి నాయకుడు అని భావిస్తున్న మలయాళం నటుడు షైన్ షాకో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. కానీర కీర్తి సురేష్ కి సంబంధించిన వీడియోస్ మాత్రం లేకపోవడంతో అసలు కీర్తి సురేష్ ఈ సినిమాలో ఉందా లేదా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే కీర్తి సురేష్ కి సంబంధించిన స్పెషల్ టీజర్ ఏమైనా విడుదల చేస్తారా అని కూడా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ టీజర్ లో నాని ఎలా అయితే రెస్టిక్ లుక్కులో కనిపించాడు. కీర్తి సురేష్ కూడా అదే తరహాలో కనిపించబోతుంది అన్న ప్రచారం జరుగుతుంది. అంతేకాదు కనిపించిన విధంగా ఈ సినిమాలో కీర్తి సురేష్ కనిపించబోతుంది అన్న వార్తలు సైతం వినబడుతున్నాయి. అలాంటి పాత్రని అంత ఈజీగా ఒకే టీజర్ లో చూపిస్తే కిక్కేముంటుంది అని భావించిన మేకర్స్ కీర్తి సురేష్ కి సంబంధించి ఒక స్పెషల్ టీజర్ ని ప్లాన్ చేసి ఉంటారు అని సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: