
ఇదిలా ఉండగా ఇప్పటికే చాలాసార్లు వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద తమ సినిమాలతో పోటీ పడిన విషయం తెలిసిందే. ఏకంగా 8సార్లు సంక్రాంతి బరిలో పోటీ పడగా ఐదుసార్లు మిగతా రోజులలో పోటీ పడినట్లు తెలుస్తోంది. ఇక ఈసారి దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్లీ సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో పోటీపడ్డారు. కలెక్షన్ల పరంగా తమ తమ సినిమాలకు భారీగానే వచ్చినా ఎవరు విజేత అనే విషయానికి వస్తే బాలయ్య వీరసింహారెడ్డి సినిమా కంటే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ముందంజలో ఉంది అని చెప్పవచ్చు.
ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ చిరు వర్సెస్ బాలయ్య పోటీని మనం చూడబోతున్నాము అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో N108 పని వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. మరొకవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి భోలా శంకర్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమా షూటింగ్ లు కూడా పూర్తి కానున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలను కూడా సమ్మర్ సందర్భంగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాలలో ఎవరిది పై చేయి అవుతుందనేది.. సంక్రాంతి పోటీ తర్వాత ఇప్పుడు మరింతగా ఉత్కంఠగా మారింది.