
ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు జబ్బుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్వీటీకి కూడా ఒక జబ్బు ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే అది జబ్బు కాదు కానీ ఒకసారి ఆమె నవ్వింది అంటే ఆ నవ్వును కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమట. 15 నిమిషాల వరకు కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంటుందని సమాచారం.. ఈ విషయం తెలిసే ఆమె అభిమానులు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్న .. మరొకవైపు ఇదేం జబ్బు రా బాబు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
అనుష్క మాట్లాడుతూ.. నేను నవ్వడం మొదలుపెడితే షూటింగ్ కొంచెం సేపు ఆపేయాల్సిందే దాదాపు 20 నిమిషాల వరకు బ్రేక్ తీసుకోవాలి... ఆలోపు అందరూ టిఫిన్ కూడా చేసి వస్తారు.. కంటిన్యూగా ఆ నవ్వు అలా వస్తూనే ఉంటుంది.. అది ఒక జబ్బు లాగా నన్ను పీడిస్తోంది.. ఇదే కాదు ఒకసారి నేను నవ్వడం మొదలు పెడితే 20 నిమిషాల పాటు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు తిరుగుతూ నవ్వుతూ ఉంటాను.. అంటూ ఆమె చెప్పుకొచ్చింది ఈ వీడియో చూసిన అభిమానులు ఆమెపై రకరకాల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.