
అంతేకాదు తనపై తన సినిమాలపై ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్న బ్యాచ్ గురించి కూడా ప్రస్తావించాడు కిరణ్ అబ్బవరం. తన సినిమాలపై ఒక బ్యాచ్ కావాలని తప్పుడు ప్రచారం చేస్తుందని.. ఇదివరకు సినిమాలకు అలానే జరిగింది సరే ఆ సినిమాలు బాగా లేవని ఊరుకున్నా కానీ వినరో భాగ్యము విష్ణు కథ లాంటి మంచి సినిమాకు కూడా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ తనని కావాలని టార్గెట్ చేస్తున్నారని. సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చానని ఇక్కడ నుంచి అంత సామాన్యంగా వెళ్లేది లేదని చెప్పాడు కిరణ్.
నెపొటిజం అంటారు కానీ సినిమా పరిశ్రమ వాళ్లు తమ లాంటి వారికి మంచి అవకాశాలు ఇస్తున్నారు కానీ ఇలా సోషల్ మీడియాలో కొందరు కావాలని తమ లాంటి వారిని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం. సినిమా బాగుంటే చూడండి.. లేకపోతే ఏం బాగాలేదో చెప్పండి కావాలని మాత్రం టార్గెట్ చేయకండి అని చెప్పారు కిరణ్. వినరో భాగ్యము విష్ణు కథ ఒక మంచి సినిమా అని ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఒక మంచి మూవీ ఇదని అన్నారు. ఇలాంటి సినిమా గురించి కూడా నెగటివ్ గా మాట్లాడుతున్నారని తన ఆవేదనని చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం.