ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందె. అదే సమయంలో వరుసగా బ్లాక్బస్టర్ విజయాలను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ ఉన్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ అనే ఒక తమిళ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇక ఇటీవల సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అనే ఒక మాస్ కమర్షియల్ సినిమాతో వచ్చి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ విజయాన్ని సాధించాడు అన్న విషయం తెలిసిందె. ఇలా ఇటీవల కాలంలో చిరంజీవి పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది అని చెప్పాలి. మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.


 ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన సెట్స్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అయితే తమిళ్లో అజిత్ నటించిన మాస్ మసాలా మూవీ అయినా వేదాళం సినిమాకి ఈ సినిమా రీమేక్ కావడం గమనార్హం. ఈ సినిమాలో వింటేజ్  మెగాస్టార్ ని ఒక రేంజ్ లో చూపించి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడానికి దర్శకుడు మెహర్ రమేష్ సిద్ధమవుతున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే చిరు గత సినిమాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా ఇందులో చూపించబోతున్నారట. చిరంజీవి హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ చూడాలని ఉంది లో రామ్మా చిలకమ్మా సాంగ్ ని ఇక భోలా శంకర్ సినిమాలో రీమేక్ చేయబోతున్నాడట.


 ఈ పాట అప్పట్లో ఎంతలా ఆడియన్స్ ని ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఇప్పుడు రీమేక్ పాట వస్తుంది అని తెలియడంతో ఫాన్స్ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ హిట్ మూవీ ఖుషి లోని నడుము సీన్ ని కూడా బోలా శంకర్ లో పెట్టబోతున్నాడట మెహర్ రమేష్. అయితే ఖుషి సినిమాలో పవన్ భూమికల నడుము సీన్ అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి. ఇప్పటికి కూడా ఫాన్స్ కి ఆ సీన్ ఎవర్గ్రీన్. ఈ సన్నివేశాన్ని బోలాశంకర్ లో పెడితే అన్నయ్య చిరంజీవి చేస్తే చూడాలని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: