టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఇప్పటివరకు అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లను మిస్ చేసుకున్నాడు. అలా పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ లు ఏవో తెలుసుకుందాం.

మాస్ మహారాజా రవితేజ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఇడియట్ సినిమా ఏ రేంజ్ విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కథను మొదటగా పూరి జగన్నాథ్ ... పవన్ కళ్యాణ్ కు వినిపించగా కొన్ని కారణాల వల్ల పవన్ ఈ మూవీ లో నటించడానికి ఆసక్తిని చూపించ లేదు. దానితో పూరి జగన్నాథ్ ఇదే కథను రవితేజ కు వినిపించగా రవితేజ కు ఈ కథ బాగా నచ్చడంతో ఈ మూవీ తెరకెక్కింది. అలా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

మహేష్ బాబు హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ కథను మొదటగా దర్శకుడు పూరి జగన్నాథ్ ... పవన్ కళ్యాణ్ కు వినిపించగా ఈ మూవీ ని కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమ కథను పూరి జగన్నాథ్ ... మహేష్ బాబు కు వినిపించగా ఈ కథ బాగా నచ్చిన మహేష్ బాబు ఈ సినిమాలో నటించాడు. అలా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన పోకిరి కథ మహేష్ బాబు దగ్గరికి వెళ్లి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అతడు మూవీ కథను మొదటగా త్రివిక్రమ్ ... పవన్ కళ్యాణ్ కు వినిపించగా ఈ కథ నచ్చని పవన్ కళ్యాణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. దానితో త్రివిక్రమ్ ఇదే కథను మహేష్ బాబు కు వినిపించగా మహేష్ బాబు కి కథ బాగా నచ్చడంతో మహేష్ తో త్రివిక్రమ్ "అతడు" పేరుతో ఈ సినిమాను తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: