తమిళ స్టార్ హీరో శింబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం సినిమాలతోనే కాదు వివాదాలతో కూడా ఈ హీరో బాగా పాపులర్ అయ్యాడు. మరీ ముఖ్యంగా తనతో సినిమాలలో నటించిన హీరోయిన్ లతో ప్రేమాయణం నడిపి చట్టాపట్టాలేసుకొని కొన్ని రోజుల తర్వాత బ్రేకప్ చెప్పుకోవడం ఆయనకు చాలా సర్వసాధారణ అనే వార్తలు కోలీవుడ్ లో  వినిపిస్తుంటాయి . ఈ క్రమంలోనే గతంలో హన్సిక, త్రిష, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన శింబు ఆ తర్వాత కాలంలో ఆ ముగ్గురితో కూడా విభేదాలు కారణంగా విడిపోయారు. తర్వాత  నయనతార , హన్సిక వివాహం చేసుకొని సెటిల్ అవ్వగా.. త్రిష మాత్రం ఇంకా వివాహానికి దూరంగానే ఉండి వరుస సినిమాలతో బిజీగా ఉంది.ఇదిలా ఉండగా తాజాగా శింబు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. శ్రీలంకకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతుర్ని ఆయన వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది.


ఇక ఆ అమ్మాయి ఒక మెడికల్ స్టూడెంట్ అని.. పైగా శింబుకి వీరాభిమాని అని సమాచారం తెలుస్తోంది.ఇక అంతేకాదు శింబుని తరచూ కలవడానికి వెళ్లే ఆ అమ్మాయి.. అతనితో పరిచయం పెంచుకొని ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు ఏకంగా పెళ్లికి దారి తీసింది అని సమాచారం తెలుస్తుంది.. ఇక ఆ అమ్మాయి తండ్రికి శ్రీలంకలో పలు వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయట.అంతేగాక ఇక వీరి పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు కూడా అంగీకరించినట్లు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ వార్తలలో ఎంత నిజం ఉంది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతుండగా తాజాగా శింబు ఈ పెళ్లి వార్తలపై స్పందించాడు. ఇవన్నీ ఒట్టి పుకార్లే అని తన పెళ్లి గురించి వస్తున్న వార్తలు అన్ని ఫేక్ వార్తలని స్పందించి ఈ వార్తలని కొట్టి పడేసాడు. ప్రస్తుతం తన ధ్యాస అంతా కూడా సినిమాల మీదనే అని శింబు క్లారిటీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: