
ఈ క్రమంలోనే ఇప్పుడు మూడు బడా ప్రొడక్షన్ హౌస్ లు కలిపి ప్రభాస్ తో ఒక భారీ బడ్జెట్ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాయ్ అంటూ ఒక టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో తెగచక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ అటు పటాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ ఆనందుతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతుంది. అయితే వందల కోట్ల బడ్జెట్ భరించబోయే నిర్మాతలు ఎవరు అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
అయితే బయట టాక్ వినిపిస్తున్నట్లుగా కేవలం ఒక్క movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మాత్రమే ఈ సినిమాను నిర్మించడం లేదట. మరో రెండు టాప్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కాబోతున్నాయట. ఇప్పుడు పటాన్ హిట్ తర్వాత హృతిక్ రోషన్ తో ఫైటర్ సినిమా చేస్తున్నాడు సిద్ధార్థ ఆనంద్. ఆ తర్వాత ప్రభాస్తో సినిమా పట్టాలెక్కిస్తాడు. అయితే ఇక ఈ సినిమా నిర్మాణంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తో పాటు యూవి క్రియేషన్స్, యస్ రాజ్ ఫిలిమ్స్ వారు కూడా భాగం కాబోతున్నట్లు తెలుస్తుంది. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తారట. ఇదే నిజమైతే మాత్రంఇది ఒక సరికొత్త చరిత్ర అని చెప్పాలి.