తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి ధనుష్ తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యbదేవర నాగు వంశీ నిర్మాణం లో రూపొందినటు వంటి సార్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించగా సముద్ర ఖనిమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. జీ వీ ప్రకాష్ కుమార్మూవీ కి సంగీతం అందించాడు.

మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ్.లో కూడా విడుదల అయింది. తమిళ్ లో ఈ సినిమా వేత్తి అనే టైటిల్ తో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమా విడుదల 24 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న ఈ సినిమా 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది.

ఇలా భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 24 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 60.21 కోట్ల షేర్ ... 115.66 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఇప్పటికే భారీ కలక్షన్ వసూలు చేసిన ఈ సినిమా 24 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా 24.21 కోట్ల లాభాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇప్పటికి కూడా ఈ మూవీ కి డీసెంట్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: