
అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా అయన్ రాండ్ లాంటి మేధావుల పుస్తకాలు చదివి వారి ఫిలాసఫీ వంట పట్టించుకున్న ఆర్జీవి స్వప్న చేసిన రాముయిజం సిరీస్ ద్వారా తన థాట్ ప్రాసెస్ గురించి వివరించి ప్రేక్షకులను ఆశ్చర్యపరచారనీ చెప్పవచ్చు ఈ సిరీస్ చూసినవారు డైరెక్టర్ గా కన్నా ఫిలాసఫర్గా రాముని గుర్తు పెట్టుకుంటారు . అలాంటిది గత కొన్ని సంవత్సరాలుగా తన పేరుని గొప్పతనాన్ని తానే పాడు చేసుకునేలా ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో రకరకాల వల్గర్ కామెంట్స్ ,బొల్డ్ కామెంట్స్, చేయడం సెక్స్ గురించి విచ్చలవిడి వ్యాఖ్యలు చేయడం ద్వారా తన స్థానాన్ని స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు.
నాగార్జున యూనివర్సిటీ కార్యక్రమానికి అతిథిగా వెళ్లి ఆయన మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి రేపటి భవిష్యత్తు అని భావించే విద్యార్థులు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్పూర్తి కలిగించేలా మాట్లాడాల్సింది పోయి ఈయన వ్యక్తిగత స్వార్థం, విచ్చలవిడి ఆలోచనా విదానాన్ని వాళ్ళకి ప్రబోధించడం జుగుప్స కలిగిస్తుంది. చాలాసార్లు ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు రెచ్చగొట్టడం వల్లే ఆయన అలాంటి బోల్డ్ కామెంట్స్ చేస్తారు కానీ సరిగ్గా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి చాలా మంచి సమాధానాలు చెబుతారు అంటుంటారు .కానీ ఇక్కడ పూర్తిగా ఆయనే వక్త , మరి అలాంటప్పుడు ఈ విధంగా మాట్లాడటం హర్షణీయం కాదు అంతేకాకుండా దేశ అధ్యక్షుడు మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసే స్వతంత్రం గా ఉండే వర్మ ఇప్పుడు కొన్ని పార్టీలకు ఉద్దేశపూర్వకం గా మద్దతు ఇస్తున్నారు దాని వెనక ఆయన ఆర్థిక ప్రయోజనాలు ఉంటే ఉండవచ్చు కానీ ఒక రంగం లో శిఖర సమానమైన ఇమేజ్ను సాధించిన తర్వాత ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పాల్పడడం ఆ స్థానాన్ని అవమానించడం ఆయన అభిమానుల్ని బాదపెట్టడం తప్ప ఆయనకు వచ్చే ప్రయోజనం లేదు. శ్రీ రెడ్డి స్థాయికి వర్మ ను కంపేర్ చేస్తూ సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయంటే నే క్రియేటివ్ జీనియస్ స్థాయి నుండి ఆయన ఎంత కిందకి దిగిపోయారో అర్దం అవుతుంది.
ఐతే వర్మ ను శ్రీ రెడ్డి తో కంపేర్ చేస్తుంటే ఆయన అభిమనులు సోషల్ మీడియా ద్వారా తీవ్ర అగ్రహానికి గురి అవుతున్నారు.