పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినో దయ సీతం అనే తమిళ మూవీ కి రీమేక్ గా రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసింద . ఈ సినిమ లో టాలీవుడ్ యంగ్ హీరో లలో ఒకరు అయినటు వంటి సాయి ధరమ్ తేజ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తయింది. 

ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ మళ్ళీ కొత్త షెడ్యూల్ ను తాజాగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త షెడ్యూల్ లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించబోయే నటీ నటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళ సినిమాకు రీమేక్ అయినప్పటికీ ఈ మూవీ కథకు అనేక మార్పులు మరియు చేర్పులు చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ సరసన ఒక హీరోయిన్ ఉండబోతున్నట్లు ... అలాగే రెండు పాటలు కూడా ఈ మూవీ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం పవన్ చాలా తక్కువ రోజులు కేటాయించినట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ గానే అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: